విజయశాంతితో కాంగ్రెస్ నేత కుసుమకుమార్ భేటీ: రాములమ్మకు బుజ్జగింపులు

By narsimha lodeFirst Published Oct 28, 2020, 5:16 PM IST
Highlights

మాజీ ఎంపీ , కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతితో కాంగ్రెస్ పార్టీ  వర్కింగ్ ప్రెసిడెంట్  కుసుమకుమార్ బుధవారం నాడు భేటీ అయ్యారు. విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈ  భేటీకి ప్రాధాన్యత నెలకొంది.

హైదరాబాద్: మాజీ ఎంపీ , కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతితో కాంగ్రెస్ పార్టీ  వర్కింగ్ ప్రెసిడెంట్  కుసుమకుమార్ బుధవారం నాడు భేటీ అయ్యారు. విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈ  భేటీకి ప్రాధాన్యత నెలకొంది.

కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి విజయశాంతితో భేటీ కావడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. నవంబర్ మొదటి వారంలో ఆమె బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది.

కొంత కాలంగా విజయశాంతి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ హైద్రాబాద్ కు వచ్చిన సమయంలో విజయశాంతికి ఆహ్వానం పంపారు. కానీ ఆమె మాత్రం ఈ సమావేశానికి హాజరుకాలేదు.

also read:కిషన్ రెడ్డి చర్చలు: కాంగ్రెసుకు గుడ్ బై, బిజెపిలోకి విజయశాంతి జంప్?

ఎన్నికల ప్రచారం సమంలోనే విజయశాంతి గుర్తుకు వస్తోందా అని కాంగ్రెస్ పార్టీ నేతలను ఉద్దేశించి ఆమె ప్రశ్నించారని ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరిన సమయంలో ఆదిలాబాద్ నుండి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో యాత్ర చేస్తానని విజయశాంతి పార్టీ నాయకత్వాన్ని కోరింది. కానీ విజయశాంతి యాత్రకు పార్టీ అనుమతి ఇవ్వలేదు.

దీంతో ఆమె అలకబూనినట్టుగా ప్రచారం సాగుతోంది. ఈ కారణంగానే ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది. పార్టీ నిర్వహించే కొన్ని కార్యక్రమాలకు సమాచారం ఇవ్వడం లేదని కూడ ఆమె అసంతృప్తితో ఉంది. ఠాగూర్ పర్యటనకు సంబంధించిన సమాచారం ఇచ్చినా కూడ ఆమె హాజరు కాకపోవడం ప్రస్తుతం పార్టీలో చర్చకు తెరతీసింది.

అసంతృప్తితో ఉన్న విజయశాంతితో పీసీసీ తరపున కుసుమకుమార్ రాయబారం నడుపుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆమెను బుజ్జగించేందుకు పీసీసీ నాయకత్వం చర్చలు జరుపుతుందని సమాచారం.

click me!