లోక్ సభ ఎన్నికల (lok sabha election 2024) నేపథ్యంలో ముస్లింలను (Muslims) ప్రసన్నం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ట (ayodhya ram mandir pran pratishtha) కార్యక్రమానికి హాజరుకావడం లేదని తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి ఎన్ వీ సుభాష్ (Telangana bjp spokesperson NV Subhash) ఆరోపించారు. కానీ ఏదో ఒక రోజు ఆ పార్టీ తప్పు తెలుసుని రాముడికి శిరస్సు వంచి నమస్కరిస్తుందని తెలిపారు.
ముస్లింలను ప్రసన్నం చేసుకునేందుకే అయోధ్యలో జరిగే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ హాజరుకావడం లేదని తెలంగాణ బీజేపీ ఆరోపించింది. రానున్న లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ అధికార ప్రతినిధి ఎన్ వీ సుభాష్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఆకాశ్ ఎన్ జీ క్షిపణి పరీక్ష విజయవంతం.. ఏమిటీ ఎన్ జీ.. ? దానితో ఉపయోగాలేంటి ?
కాంగ్రెస్ నేతల రామ మందిర ప్రాణ ప్రతిష్టకు అందిన ఆహ్వానాన్ని తిరస్కరించడం భారత ప్రజలను అవమానించడమేనని సుభాష్ పేర్కొన్నారు. ఏదో ఒక సాకుతో శ్రీరాముడి ప్రతిష్ఠాపన కార్యక్రమానికి దూరంగా ఉండాలని ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం భారత ప్రజలను అవమానించడంతో పాటు, దేశ ప్రాచీన సంస్కృతిని ఉద్దేశపూర్వకంగా విస్మరించినట్లైందని ఆరోపించారు.
కాగా.. జనవరి 22న అయోధ్యలో రామమందిరం ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని రామాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజల మనోభావాలను, నమ్మకాన్ని సీఎం గౌరవించాలని అన్నారు.
అయోధ్యకు తొలి విమానం.. రాముడు, సీత, హనుమంతుడి వేషధారణలో ప్రయాణికులు.. వీడియో వైరల్
రామ మందిర ప్రారంభోత్సవానికి హాజరుకాకపోవడం కోట్లాది మంది ప్రజల విలువలు, సంస్కృతి, విశ్వాసాన్ని బహిష్కరించడంతో సమానమని ఆయన పేర్కొన్నారు. రామ మందిర ఆహ్వానాన్ని తిరస్కరించిన కాంగ్రెస్ కు లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారని తెలిపారు ఆ పార్టీ తన తప్పు తెలుసుకుని ఏదో ఒక రోజు రాముడికి శిరస్సు వంచి నమస్కరిస్తుందన్నారు.
ఇదిలా ఉండగా.. జనవరి 22న అయోధ్యలో జరిగే శ్రీరాముల 'ప్రాణ ప్రతిష్ఠ' కార్యక్రమానికి హాజరుకావాలని కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, అధిర్ రంజన్ చౌదరిలకు ఆహ్వానం అందింది. అయితే ఆ ఆహ్వానాన్ని సున్నితంగా కాంగ్రెస్ పార్టీ శుక్రవారం తిరస్కరించింది. ఈ కార్యక్రమం ఆర్ఎస్ఎస్- బీజేపీ కార్యక్రమం అని స్పష్టంగా అర్థమవుతోందని ఆ పార్టీ ఆరోపించింది.
బస్సులో సీటు కోసం మళ్లీ ఫైట్.. జుట్టు పట్టుకొని, కొట్టుకున్న మహిళలు.. వీడియో వైరల్..
అయోధ్యలో జరిగే రామలల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు, క్రీడాకారులు, ప్రముఖులను ఆహ్వానించారు. కాంగ్రెస్ అగ్ర నాయకులతో పాటు బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఆర్జేడీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్, సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి తదితర విపక్ష నేతలు ఉన్నారు.