Hyderabad: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత అజిత్ పవార్ తిరుగుబాటుతో మహారాష్ట్ర రాజకీయాలు సరికొత్తగా మారుతూ హీటును పెంచాయి. ఈ క్రమంలోనే స్పందించిన కాంగ్రెస్ నేత జైరాం రమేష్.. బీజేపీ తన 'వాషింగ్ మెషీన్'ను ప్రారంభించిందని విమర్శించారు. దర్యాప్తు సంస్థల ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి అవినీతి నాయకులు నౌక దూకారని ఆరోపించారు. అయితే, మహారాష్ట్రలో బీజేపీని గద్దె దించేందుకు కాంగ్రెస్ కృషి చేస్తుందన్నారు. అలాగే, తెలంగాణ కాంగ్రెస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.
Congress General Secretary Jairam Ramesh: కర్నాటక తరహాలో తెలంగాణలోనూ కాంగ్రెస్ విజయం దిశగా దూసుకుపోతోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అన్నారు. కర్నాటక లో మాదిరిగానే తెలంగాణలోనూ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని తెలిపారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత అజిత్ పవార్ తిరుగుబాటుతో మహారాష్ట్ర రాజకీయాలు సరికొత్తగా మారుతూ హీటును పెంచాయి. ఈ క్రమంలోనే స్పందించిన కాంగ్రెస్ నేత జైరాం రమేష్.. బీజేపీ తన 'వాషింగ్ మెషీన్'ను ప్రారంభించిందని విమర్శించారు. దర్యాప్తు సంస్థల ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి అవినీతి నాయకులు నౌక దూకారని ఆరోపించారు. అయితే, మహారాష్ట్రలో బీజేపీని గద్దె దించేందుకు కాంగ్రెస్ కృషి చేస్తుందన్నారు. అలాగే, తెలంగాణ కాంగ్రెస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ దే గెలుపు..
గత ఏడాది తెలంగాణలో జరిగిన భారత్ జోడో యాత్ర తర్వాత కర్నాటకలో విజయం సాధించినట్లే రాష్ట్రంలోనూ గ్రాండ్ ఓల్డ్ పార్టీ విజయపథంలో దూసుకుపోతోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వరంగల్ లో రైతు డిక్లరేషన్, హైదరాబాద్ లో యూత్ డిక్లరేషన్ ప్రకటించిందని, ఆదివారం సీనియర్ సిటిజన్లు, వితంతువులకు నెలకు రూ.4000 చొప్పున పింఛన్ ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారని జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పోడు భూములను ఆదివాసీలకు తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలోని 8 జిల్లాల గుండా 405 కిలోమీటర్లు సాగిన భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించడంతో కర్నాటకలో మాదిరిగానే తెలంగాణలోనూ విజయం దిశగా పయనిస్తున్నామని స్పష్టమవుతోందన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే వితంతువులు, సీనియర్ సిటిజన్లకు నెలకు రూ.4,000 పింఛన్ ఇస్తామని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణలో ప్రకటించిన మరుసటి రోజే పార్టీ కమ్యూనికేషన్ ఇంచార్జ్ కూడా అయిన రమేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఖమ్మంలో జరిగిన 'జన గర్జన' బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పోడు భూములను గిరిజనులకు తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారు.
రైతులు, దళితుల నుంచి కేసీఆర్ ప్రభుత్వం లాక్కున్న భూములన్నింటినీ తిరిగి ఇచ్చేస్తామని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పారు. కాగా, తెలంగాణలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తుండగా, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కూడా రాష్ట్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇదే క్రమంలో బీజేపీ సైతం రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ లతో పోటీ పడుతూ సత్తా చాటాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది.