తెలంగాణ సీనియర్లపై కాంగ్రెస్ కన్ను: ఎఐసీసీలోకి తీసుకొనే ఛాన్స్

By narsimha lodeFirst Published Oct 28, 2021, 6:58 PM IST
Highlights


తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలకు ఎఐసీసీలో పదవులు దక్కే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డికి పీసీసీ పీఠం కట్టబెట్టడంతో అసంతృప్తిగా ఉన్న కొందరు సీనియర్లకు పార్టీలో  పెద్దపీట వేసే అవకాశం ఉందని సమాచారం.


హైదరాబాద్: తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలకు ఎఐసీసీలో  పదవులు దక్కే అవకాశం ఉంది. Revanth reddy పీసీసీ పీఠం కట్టబెట్టడంతో  అసంతృప్తిగా ఉన్న కొందరు సీనియర్లకు పార్టీలో పెద్దపీట వేసే అవకాశం ఉందని సమాచారం.  ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం చర్యలు చేపట్టింది.

టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న  ప్రజా వ్యతిరేక విధానాలపై  నిరసన కార్యక్రమాలు, సభల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొందరు సీనియర్లు పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. తమ సలహాలు తీసుకోకుండానే రేవంత్ రెడ్డి దూకుడుగా వెళ్తున్నారని కొందరు సీనియర్లలో అసంతృప్తి కూడా లేకపోలేదు. ఇదే విషయమై పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ Manickam tagoreకు కూడా కొందరు నేతలు రేవంత్  రెడ్డిపై ఫిర్యాదు చేశారు.

also read:తెలంగాణ కాంగ్రెస్ యువనేతకు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు.. రేవంత్‌ రెడ్డికి చెక్?

అసంతృప్తులను సంతృప్తి పరిచేందుకు ఎఐసీసీలో కొంతమంది నేతలకు కీలక పదవులు కట్టబెట్టింది. దానిలో భాగంగా జాతీయాంశాలపై ఆందోళనలు చేపట్టేందుకు కమిటీని చేసిన సోనియా గాంధీ ఏర్పాటు చేసింది. కమిటీ ఛైర్మన్‌గా దిగ్విజయ్ సింగ్‎ను నియమించగా సభ్యుల్లో ప్రియాంక గాంధీతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డికి చోటు కల్పించారు. పీసీసీ చీఫ్ కోసం పోటీ పడిన మాజీ ఎమ్మల్యే వంశీచందర్‌రెడ్డికి ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జ్ కార్యదర్శిగా నియమించింది. Tpcc చీఫ్ పదవి వస్తుందని ఆశించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఏఐసీసీలోకి తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం కూడా లేకపోలేదు.ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులు దక్కితే రేవంత్ తో కలిసా పార్టీ కార్యక్రమాల్లో సీనియర్లు పాల్గొంటారా లేదా అనేది ఇప్పటికిప్పుడే చెప్పలేం.  

2023 నాటికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందని రేవంత్ రెడ్డి ధీమాను వ్యక్తం చేస్తున్నారు.  ఈ రెండేళ్ల పాటు పార్టీ కార్యకర్తలు కష్టపడి పార్టీ కోసం పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందదని రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులను ఉత్సాహపరుస్తున్నాడు.. రేవంత్ రెడ్డిపై గుర్రుగా ఉన్న సీనియర్లు ఏదో ఒక వంకతో నిత్యం పార్టీ పెద్దలకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఆ సీనియర్ నేతలకు ఇప్పుడు ఏఐసీసీలో బాధ్యతలు ఇచ్చిన తర్వాత సైలెంట్‎గా ఉంటారా లేక రేవంత్‎పై మరింత దూకుడుతో ముందుకు వెళ్తారా అనేది  భవిష్యత్తులో తేలనుంది.రాష్ట్రంలో ఉన్నప్పుడే నిత్యం ఫిర్యాదులు చేసినా ఆ నేతలు ఏఐసీసీలో పదవీ బాధ్యతలు స్వీకరిస్తే దానిని వారికి అనుకూలంగా మార్చుకుంటారనే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అధిష్ఠానానికి మరింత చేరువైతే రేవంత్ రెడ్డిపై ఫిర్యాదులు చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుందనే వాదనలు కూడా లేకపోలేదు. 

ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత  రెండు దఫాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. వచ్చే ఎన్నికలోనైనా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఆ పార్టీ నాయకులు  కోరుతున్నారు.. 2023 ఎన్నికల్లో  టీఆర్ఎస్ ను గద్దె దించి అదికారంలోకి తీసుకువస్తామని రేవంత్ రెడ్డి ధీమాగా చెబుతున్నారు. 

 

 

 

 

click me!