జనాల వాట్సాప్ చాట్‌లు చెక్ చేస్తున్న హైదరాబాద్ పోలీసులు.. రోడ్డు మీద ఆపి ఫోన్‌లు అడుగుతున్నారు..

By team teluguFirst Published Oct 28, 2021, 4:40 PM IST
Highlights

గత కొద్ది రోజులుగా  హైదరాబాద్ రోడ్ల మీద వెళ్తున్న కొందరికి ఊహించని విధంగా పోలీసులు షాక్ ఇస్తున్నారు. కొందరి మొబైల్ వ్యక్తులను అడుగుతున్న పోలీసులు.. వారి వాట్సాప్ చాట్‌లు (WhatsApp chats) చెక్ చేస్తున్నారు. 

గత కొద్ది రోజులుగా  హైదరాబాద్ రోడ్ల మీద వెళ్తున్న కొందరికి ఊహించని విధంగా పోలీసులు షాక్ ఇస్తున్నారు. కొందరి మొబైల్ వ్యక్తులను అడుగుతున్న పోలీసులు.. వారి వాట్సాప్ చాట్‌లు (WhatsApp chats) చెక్ చేస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారంటే.. ఇటీవల హైదరాబాద్ పోలీసులు.. నగరంలో గంజాయిని పూర్తిగా తొలగించేవరకు తాము విశ్రాంతి తీసుకోమని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గంజాయి తీసుకుంటున్నవారిని, సరఫరా చేస్తున్నవారికి గుర్తించేందుకు ప్రతి పోలీస్ స్టేషన్‌ పరిధిలో పోలీసులు తనిఖీలు, దాడులు నిర్వహించాలని పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీచేశారు. ఈ క్రమంలోనే పోలీసులు రోడ్లపై వెళ్తున్న పలువురిని ఆపి తనిఖీలు చేస్తున్నారు.

అయితే పోలీసులు సామాన్యుల వాహనాలను తనిఖీ చేయడమే కాకుండా, వారి మొబైల్ ఫోన్లను తీసుకుని కూడా వాట్సాప్ చాట్‌ను చెక్ చేస్తున్నారు. గంజా, drugs అని సెర్చ్ చేస్తూ ఏమైనా సమాచారం ఉందా..? అని చూస్తున్నారు. ఇందుకు సంబంధించి ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. 

Also read: యూట్యూబ్ వీడియో చూస్తూ బిడ్డకు జన్మనిచ్చిన మైనర్ బాలిక.. పెళ్లికి ముందే శృంగారం..

ఇందుకు సంబంధించి  సౌత్ జోన్ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ గజరావు భూపాల్ TNMతో మాట్లాడుతూ.. ‘అవును, పోలీసులు ఫోన్‌లను తనిఖీ చేస్తున్నట్లు నాకు తెలుసు. అయితే మేము ఎవరినీ బలవంతం చేయడం లేదు. తనిఖీ చేయడానికి వారి ఫోన్‌లను లాక్కోవడం లేదు. ప్రజలు సహకరిస్తున్నారు. ఎవరూ ఫిర్యాదు చేయడం లేదు, కాబట్టి ఇది చట్టవిరుద్దమైనది అని నేను అనుకోవడం లేదు’ అని అన్నారు. 

 

New policing practices alert: stop and search phone chats by the . Police are searching phone chats for words like ganja. Wait until they replace words with NRC, Modi or BJP. pic.twitter.com/1lNjvKRIgk

— Srinivas Kodali (@digitaldutta)

హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) చర్యలపై హక్కుల కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల చర్య చట్టవిరుద్దం మాత్రమే కాకుండా రాజ్యంగ విరుద్దమని విమర్శిస్తున్నారు. గోప్యత అనేది పౌరుల ప్రాథమిక హక్కు అని సుప్రీం కోర్టు తీర్పును గుర్తుచేస్తున్నారు. ఆర్టికల్ 21 లో గోప్యత అనేది అంతర్గతంగా ఉంటుందని సుప్రీం కోర్టు తీర్పును ప్రస్తావిస్తున్నారు. ఒక వ్యక్తి మొబైల్ ఫోన్‌ను కారణం లేకుండా, సరైన వారెంట్ లేకుండా శోధించడం పూర్తిగా చట్టవిరుద్దమని అంటున్నారు. వ్యక్తి మొబైల్ అనేది పూర్తిగా వ్యక్తిగతమైనది అని పేర్కొంటున్నారు. 

Also Read: అందమైన కశ్మీర్.. భారతదేశ కిరీటంలో ఆభరణమన్న అమిత్ షా.. వైరల్ అవుతున్న ఫొటోలు..

‘గోప్యత హక్కు రాజ్యాంగ మూలంలో భాగం. గోప్యత హక్కు ప్రాథమిక హక్కు అని.. జీవించే హక్కు, స్వేచ్ఛతో వ్యవహరించే ఆర్టికల్ 21లో భాగమని సుప్రీంకోర్టు పేర్కొంది. వ్యక్తుల ఫోన్‌లను యాదృచ్ఛికంగా తనిఖీ చేసే హక్కు పోలీసులకు ఉండదు. వారు అలా చేయాలనుకుంటే చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన విధానాన్ని ఫాలో కావాలి’ తెలంగాణ హైకోర్టు లాయర్ కారం కొమిరెడ్డి TNMతో అన్నారు.

click me!