ఆన్‌లైన్‌లో పోస్ట్ పెట్టి.. మాజీ మిస్​ తెలంగాణ ఆత్మహత్యాయత్నం.. అదే కారణమా..?

By team teluguFirst Published Oct 28, 2021, 5:36 PM IST
Highlights

మాజీ మిస్ తెలంగాణ‌గా నిలిచిన హాసిని.. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. అయితే పోస్ట్ చూసిన ఆమె స్నేహితులకు సమాచారం ఇవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. 

మాజీ మిస్ తెలంగాణ‌గా నిలిచిన హాసిని.. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. అయితే పోస్ట్ చూసిన ఆమె స్నేహితులకు సమాచారం ఇవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే పోలీసులు.. హాసిని ఇంటికి చేరుకుని ఆమె ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన హైదరాబాద్‌ నారాయణ గూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉనన్నాయి. హాసిని 2018లో మిస్ తెలంగాణగా (Miss Telangana 2018 ) ఎంపికైంది. ఆమె ప్రస్తుతం హైదరాబాద్‌లోని హిమాయత్‌ నగర్‌లో నివాసం ఉంటుంది. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో హాసిని ఆత్మహత్యకు యత్నించింది (suicide attempt). ఉరేసుకుని ప్రాణాలు తీసుకోవాలని అనుకుంది. 

Also Read: అందమైన కశ్మీర్.. భారతదేశ కిరీటంలో ఆభరణమన్న అమిత్ షా.. వైరల్ అవుతున్న ఫొటోలు..

ఈ క్రమంలోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది చూసిన ఆమె స్నేహితులు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు హిమాయత్ నగర్ రోడ్ నెంబర్ 6లో ఉన్న తన ఫ్లాట్‌లోకి వెళ్లి యువతిని రక్షించి హైదర్ గూడ అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆమెకు పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. ప్రమాదం ఏం లేదని తేల్చారు. 

Also read: జనాల వాట్సాప్ చాట్‌లు చెక్ చేస్తున్న హైదరాబాద్ పోలీసులు.. రోడ్డు మీద ఆపి ఫోన్‌లు అడుగుతున్నారు..

అయితే Hasini ఇలా చేయడానికి ఆర్థిక ఇబ్బందులే కారణమని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలోనే ఆమె ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని వారు అనుమానిస్తున్నారు. మరోవైపు తనను ఓ యువకుడు శారీరకంగా వేధించాడని హాసిని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే ఆమె ఆత్మహత్యకు యత్నించడంతో..  ఏ కారణం చేత ఆమె ఇలా చేసిందనేది తేలాల్సి ఉంది. ఇవి కాకుండా ఆమెకు మరేమైనా కారణం ఉందా అనేది పోలీసులు విచారణలో తేలనుంది. ఇక, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఆమె ఆత్మహత్యకు ఎందుకు యత్నించింది..? సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఎందుకు చనిపోవాలని అనుకుంది..? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. 

Also read: యూట్యూబ్ వీడియో చూస్తూ బిడ్డకు జన్మనిచ్చిన మైనర్ బాలిక.. పెళ్లికి ముందే శృంగారం..

ఇక, హాసినిది తెలంగాణలోని ఖమ్మం జిల్లా (Kahmmam District). ఆమెకు ఇద్దరు అక్కలు, ఒక అన్నయ్య.  తాను బ్యూటీపార్లర్‌లో వర్క్ చేసేదానిని గతంతో ఓ ఇంటర్యూలో హాసిని చెప్పుకొచ్చింది. తనది పేద కుటుంబం అని, తాను ఇంటర్ సెకండ్ ఈయర్ డిస్ కంటిన్యూ అని ఆమె గతంలో తెలిపింది. తన తల్లి సపోర్ట్‌తోనే తాను ఈ స్థితిలో ఉన్నానని చెప్పుకొచ్చారు. 

click me!