ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్.. మంత్రి వర్గంలోకి తీసుకునే ఛాన్స్..

By Sairam Indur  |  First Published Jan 16, 2024, 6:32 PM IST

తెలంగాణ కాంగ్రెస్ (telangana congress)నాయకత్వం ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసింది (Two MLC candidates have been finalized). ఎమ్మెల్యే కోటాలో పార్టీ సీనియర్ నాయకుడు అద్దంకి దయాకర్ (addanki dayakar), ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ (NSUI telangana president balmuri venkat)లను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేసింది.


తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. అయితే నామినేషన్ల స్వీకరణకు ఇంకా రెండు రోజులు (జనవరి 18) మాత్రమే గడువు ఉంది. ఈ నేపథ్యంలో ఇద్దరు పేర్లను పార్టీ ఎంపిక చేసింది. వారిని మంత్రి వర్గంలోకి కూడా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయోధ్యకు, భద్రాచలం రామాలయానికి మధ్య ఏం తేడా లేదు - రేవంత్ రెడ్డి..

Latest Videos

కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసిన ఇద్దరు అభ్యర్థుల్లో ఒకరు పార్టీ సీనియర్ నేత అద్దంకి దయాకర్ కాగా.. మరొకరు విద్యార్థి నేత బల్మూరి వెంకట్ ఉన్నారు. వీరిద్దరూ పార్టీ కోసం కష్టపడి పని చేశారు. పార్టీ కోరడంతో ఇద్దరూ గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ సీట్లను త్యాగం చేశారు. పార్టీ బీఫాం ఇచ్చిన అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశారు. అందుకే వారిద్దరికీ పార్టీ ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తున్నట్టు తెలుస్తోంది. 

అద్దంకి దయాకర్ తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకున్నారు. కానీ పార్టీ వివిధ కారణాలు, సమీకరణల నేపథ్యంలో మందుల శ్యామూల్ కు టిక్కెట్ కేటాయించింది. కానీ ఆయన పార్టీపై ఏ మాత్రమూ అసంతృప్తి వ్యక్తం చేయలేదు. శ్యామూల్ గెలుపు కోసం పని చేశారు. పలు వేదికలపై కాంగ్రెస్ వాదాన్ని బలంగా వినిపించారు. కాంగ్రెస్ పార్టీ తరుఫున అనేక టీవీ చర్చలకు వెళ్లారు. పలు సందర్భాల్లో రేవంత్ రెడ్డి కూడా అద్దంకి దయాకర్ పార్టీ కోసం కష్టపడి పని చేశారని కొనియాడారు. 

పంజాబ్ సీఎంకు ఖలిస్తాన్ ఉగ్రవాది పన్నూన్ బెదిరింపు.. రిపబ్లిక్ డే రోజు దాడి చేస్తామని హెచ్చరిక..

అలాగే బల్మూర్ వెంకట్ కూడా చాలా కాలంగా కాంగ్రెస్ లో పని చేస్తున్నారు. హుజూరాబాద్ లో వచ్చిన ఉప ఎన్నికల్లో ఆయనను కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాలని కోరింది. అక్కడ పార్టీకి బలం తక్కువగా ఉందని తెలిసినప్పటికీ.. బల్మూరి అక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు కాంగ్రెస్ టిక్కెట్ కేటాయించలేదు. అయినా కూడా ఆయన పార్టీ విజయం కోసం పని చేశారు. కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అయిన ఎన్ ఎస్ యూఐ కి రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. టీఎస్ పీఎస్ సీ పరీక్షా పత్రాల లీక్ సమయంలో నిరుద్యోగుల తరఫున పోరాడారు. హైకోర్టుకు కూడా వెళ్లారు. అందుకే ఆయనకు కూడా పార్టీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

జపాన్ లో మళ్లీ రెండు విమానాలు ఢీ.. రన్ వేపై ఘటన..

ఎమ్మెల్సీలుగా ఖరారు చేసిన విషయాన్ని పార్టీ అధిష్టానం వారిద్దరికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. నామినేషన్ కు అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకోవాలని సూచించింది. నామినేషన్ల కోసం ఇంకా రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. 29వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అయితే వీరిలో అద్దంకి దయాకర్ ను మంత్రి వర్గంలోకి తీసుకోవాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం. 

click me!