తెలంగాణ ఏర్పాటును 14 ఏళ్లు ఆలస్యం చేసిన కాంగ్రెస్.. మా పార్టీపై కుట్ర‌లు చేసింది : కేసీఆర్

By Mahesh Rajamoni  |  First Published Nov 7, 2023, 12:14 AM IST

BRS cheaf KCR: ఉమ్మ‌డి మహబూబ్‌నగర్ జిల్లా (పాలమూరు) గురించి బీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఎండిపోయిన భూములకు నీరందించేందుకు తమ ప్రభుత్వం అనేక ప్రాజెక్టులను పూర్తి చేసిందనీ, త‌మ‌కు ఓటు వేస్తే మ‌రోసారి అధికారంలోకి వచ్చాక‌ పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
 


Telangana Assembly Elections 2023: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో బీఆర్ఎస్ ప్ర‌చారంలో భాగంగా ముఖ్య‌మంత్రి  కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి 14 ఏళ్లు జాప్యం చేసింద‌ని ఆరోపించారు. దీని కార‌ణంగా అనేక మంది తెలంగాణ పౌరులు ప్రాణాలు కోల్పోయార‌ని పేర్కొన్నారు. నవంబర్ 30న జరగనున్న తెలంగాణ‌ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలు న‌డుచుకున్న తీరును చూసి ఓటు వేయాలని కేసీఆర్ సోమవారం రాష్ట్ర ప్రజలను కోరారు. దేవ‌ర‌కొండ‌లో జరిగిన ఎన్నికల ప్ర‌చార‌ ర్యాలీలో బీఆర్ఎస్ చీఫ్ తన పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. ఓటువేసు ముందు ఆయా రాజ‌కీయ పార్టీల ట్రాక్ రికార్డు గురించి తెలుసుకోవాల‌ని సూచించారు.

బీఆర్ఎస్ పాల‌న‌లో రాష్ట్రంలో మెరుగైన పాల‌న అందించామ‌న్న సీఎం కేసీఆర్.. కాంగ్రెస్ పాల‌నలో తెలంగాణ ప‌రిస్థితులను ఎత్తిచూపారు. "వారు (కాంగ్రెస్) మా పార్టీని నాశనం చేయడానికి ప్రయత్నించారు. మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. తెలంగాణ ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేసినప్పటికీ, 14 ఏళ్ల మా పోరాటం తర్వాత మాత్రమే రాష్ట్రం ఇచ్చారు, అది కూడా రాష్ట్ర ఏర్పాటు కోసం నేను ఆమరణ నిరాహార దీక్ష చేసిన తర్వాతే" అని కేసీఆర్ అన్నారు. ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌తో రాష్ట్ర సాధన కోసం జరిగిన ఆందోళనల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ కొత్త రాష్ట్రానికి ఆమోదం తెలపడంలో జాప్యం చేయడంతో పలువురు మరణించారని అన్నారు.

Latest Videos

ఉమ్మ‌డి మహబూబ్‌నగర్ జిల్లా (పాలమూరు) గురించి బీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, ఎండిపోయిన భూములకు నీరందించేందుకు తమ ప్రభుత్వం అనేక ప్రాజెక్టులను పూర్తి చేసిందనీ, త‌మ‌కు ఓటు వేస్తే మ‌రోసారి అధికారంలోకి వచ్చాక‌ పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. సాధార‌ణ ప‌రిస్థితులతో ఓటు వేయవద్దనీ, వివిధ రాజకీయ పార్టీల ప్రవర్తనను బేరీజు వేసుకుని పేదలు, రైతుల కోసం పనిచేసే పార్టీకి ఓటు వేసి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన ప్రజలను అభ్యర్థించారు.

click me!