KTR : కేసీఆర్ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టబోతోందని, సెంచరీ కొట్టడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. వేములవాడ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రతిపక్షాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
KTR : సీఎం కేసీఆర్ స్క్రిప్ట్‌తో తెరకెక్కిన కేసీఆర్ సినిమా నవంబర్ 30న బ్లాక్ బస్టర్ అవుతుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. మన తెలంగాణ స్టోరీకి కథకు కథా రచయిత, స్క్రీన్ ప్లే రచయిత, దర్శకుడు మన నాయకుడు, మన ముఖ్యమంత్రి కేసీఆరే నని అన్నారు. ఇది బ్లాక్ బస్టర్‌గా నిలవబోతోందని, కన్నడ నిర్మాత, ఢిల్లీ దర్శకులు, గుజరాత్ నటుడు నిర్మిస్తున్న మరో సినిమా అట్టర్ ఫ్లాప్ అయి డిజాస్టర్‌గా మారబోతోందని అన్నారు.
సోమవారం వేములవాడలో జరిగిన బీఆర్‌ఎస్ యువ ఆత్మీయ సమ్మేళనంలో అన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని ఎవరు నడపాలో నిర్ణయించేది ప్రధాని నరేంద్ర మోదీ లేదా ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ కాదనీ, ఆ నిర్ణయం తెలంగాణా ప్రజల చేతిలో ఉందని అన్నారు. తరచూ ముఖ్యమంత్రులను మార్చే కాంగ్రెస్ సంస్కృతి దృష్ట్యా.. తెలంగాణను ఢిల్లీకి అప్పగిస్తే రాష్ట్రం అస్థిరంగా మారుతుందని మంత్రి విమర్శించారు. వేములవాడలో పోటీ చేసింది చల్మెడ లక్ష్మీనర్సింహారావు కాదనీ.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వేములవాడలో పోటీ చేస్తారనే విషయాన్ని ప్రజలు పరిగణించాలన్నారు.
ప్రజలు ప్రతిపక్షాలకు ఓటేస్తే ఢిల్లీ, గుజరాత్‌లు రాజ్యమేలుతారనీ, తెలంగాణకు తిరిగి అన్యాయం జరుగుతుందని అన్నారు. ఆరు పాయింట్ల ఫార్ములాను ఇందిరాగాంధీ అటకెక్కించారని గుర్తు చేసిన మంత్రి కేటీఆర్.. రాహుల్ గాంధీ ఇప్పుడు ఆరు హామీల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆరు హామీలను మరిచి నవంబర్ 30న రాహుల్ గాంధీని తెలంగాణ సిక్స్ కొట్టనునందని అన్నారు.
భారత క్రికెటర్ విరాట్ కోహ్లి మాదిరిగానే సీఎం కేసీఆర్ కూడా సెంచరీ కొట్టి 100 సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని అన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ బలంగా విశ్వసిస్తున్నారని, కుల, మత భావాలను ఉపయోగించి ప్రతిపక్షాలు ఆడుతున్న తప్పుడు వాగ్దానాలకు, మానసిక ఆటలకు ప్రజలు పడవద్దని మంత్రి కేటీఆర్ ప్రజలను కోరారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ అంటే నమ్మకం, భరోసా. సెంటిమెంట్లకు, ఆయిట్‌మెంట్లకు మోసపోకండని అన్నారు. మూడుసార్లు ఓడిపోయాను దండం పెడుతా అంటే పడిపోకండి. కులం కూడు పెట్టదు. సెంటిమెంట్‌తో ఏమీ కాదు అని కేటీఆర్ తేల్చిచెప్పారు.