Congress Candidates Third List: తెలంగాణ అసెంబ్లీకి నవంబర్ 30న ఎన్నికలు జరుగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి. అధికార పీఠం దక్కించుకోవడానికి దూకుడుగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్.. ఎన్నికల బరిలో నిలిపే అభ్యర్థలకు సంబంధించి ఇప్పటికే రెండు జాబితాలు ప్రకటించింది. తాజాగా మూడో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.
Telangana Assembly Elections 2023: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిపే మూడో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 16 మంది అభ్యర్థులతో కూడిన 3వ జాబితాను కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సోమవారం విడుదల చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పై పోటీకి రేవంత్ రెడ్డి సై అన్నారు. రేవంత్ రెడ్డిని కామారెడ్డి నుంచి కూడా కాంగ్రెస్ బరిలోకి దింపింది. ఇప్పటికే ఆయన కోడంగల్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. కామారెడ్డి నుంచి ఎన్నికల్లో పోటీకి వెనుకడుగు వేసిన షబ్బీర్ అలీని నిజామాబాద్ అర్భన్ నుంచి బరిలో దింపారు.