LS Polls: కాంగ్రెస్, బీజేపీ హుషారు.. ఉలుకులేని బీఆర్ఎస్!

By Mahesh K  |  First Published Feb 26, 2024, 3:37 AM IST

లోక్ సభ ఎన్నికల కోసం తెలంగాణలోని మూడు ప్రధాన పార్టీల్లో కాంగ్రెస్, బీజేపీ కసరత్తులు మొదలు పెట్టాయి. కానీ, మొన్నటి వరకు అధికారంలో ఉండి దిగిపోయిన బీఆర్ఎస్ మాత్రం ఇంకా కసరత్తు మొదలు పెట్టకపోవడం చర్చనీయాంశంగా మారింది.
 


BRS: పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ వచ్చే నెల 13వ తేదీ తర్వాత వెలువడనుంది. తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు తొలి విడతలోనే జరిగే  అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికతోపాటు క్యాంపెయిన్ పైనా ఫోకస్ పెట్టాయి. కాంగ్రెస్ ఇప్పటికే మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌ను ప్రకటించింది. ఇక బీజేపీ విజయ సంకల్ప యాత్రలతో రాష్ట్రమంతటా కవర్ చేయాలని ప్లాన్ వేసుకుంది. కానీ, బీఆర్ఎస్‌లో మాత్రం ఏ కదలికలు కనిపించడం లేదు.

చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావులే మళ్లీ అభ్యర్థులుగా బరిలోకి దిగుతారని గులాబీ నేతలు చెబుతున్నారు. అంతకు మించి కొత్తగా లోక్ సభ ఎన్నికలకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలు, చర్యలు ఏమీ లేవు.

Latest Videos

undefined

నల్లగొండలో కేసీఆర్ సభ తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ క్రియాశీలకంగా ఉంటుందని భావించారు. క్యాడర్‌లో మళ్లీ హుషారు తేవడానికి వరుస కార్యక్రమాలు, యాత్రలు ఉంటాయనీ చర్చించారు. కానీ, నల్లగొండ సభ తర్వాత గులాబీ దళం దాదాపుగా సైలెంట్ అయిపోయింది. క్యాంపెయినింగ్ ప్రణాళికలు లేవు. అభ్యర్థుల ఎంపిక కసరత్తు కూడా ఎక్కడా కనిపించడం లేదు.

Also Read : RGV: మరీ ఈ స్థాయిలోనా?.. పవన్ కళ్యాణ్ పై ఆర్జీవీ అరాచకం

ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ పార్టీ.. బీజేపీతో పొత్తు కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నదనే ప్రచారం జరిగింది. కానీ,బీజేపీ నుంచి అనుకున్న సంకేతాలు రావడం లేదనీ అన్నారు. ఇదిలా ఉండగా, బీజేపీ రాష్ట్ర నాయకులు మాత్రం ఆ వాదనలను ఘాటుగా ఖండించారు. 

click me!