Hyderabad: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు-2023 కోసం రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే పొత్తుల విషయంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే, రాబోయే తెలంగాణ అసెబ్లీ ఎన్నిల్లో తెలుగు దేశం పార్టీ (టీడీపీ) ఒంటరిగానే పోటీ చేయనుందని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు-2023 కోసం రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే పొత్తుల విషయంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే, రాబోయే తెలంగాణ అసెబ్లీ ఎన్నిల్లో తెలుగు దేశం పార్టీ (టీడీపీ) ఒంటరిగానే పోటీ చేయనుందని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
వివల్లోకెళ్తే.. ఈ ఏడాది చివరలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్-డిసెంబర్ నెలల్లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఒంటరిగానే బరిలోకి దిగనుంది. తెలంగాణలో తమ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్షాలతో పొత్తు పెట్టుకుని టీడీపీ పోటీ చేసింది. టీడీపీ కేవలం రెండు స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు తరువాత అధికార భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) లో చేరారు.
తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తుందా అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో నెలకొన్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటుందా అన్న ప్రశ్నకు సమయం ముగిసిందంటూ వ్యాఖ్యానించారు. అయితే మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెడతారా లేక పరిమిత సంఖ్యలో సెగ్మెంట్లలో అభ్యర్థులను నిలబెడతారా అనేది పార్టీ ఇంకా నిర్ణయించలేదు. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి పార్టీ ఒక కమిటీని ఏర్పాటు చేసిందని చంద్రబాబు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ లో ఇతర పార్టీలతో టీడీపీ పొత్తు పెట్టుకుంటుందా అని ప్రశ్నించగా అవసరాన్ని బట్టి పొత్తు ఉంటుందని చంద్రబాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్మారక నాణెం విడుదల చేసిన సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో టీడీపీ అధ్యక్షుడు కాసేపు ముచ్చటించారు. జూన్ లో జేపీ. నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా చంద్రబాబు చర్చలు జరిపారు. తమ కూటమి పునరుద్ధరణపై వారు చర్చించినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీపై వెనక్కి తగ్గిందని ఆరోపిస్తూ 2018లో బీజేపీతో టీడీపీ సంబంధాలు తెంచుకుంది. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారాన్ని కోల్పోయింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కొనేందుకు టీడీపీ, బీజేపీలతో పొత్తు పెట్టుకోవాలని జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఇప్పటికే ఈ తరహా పొత్తుల గురించి ఆయన వ్యాఖ్యానించారు.