ఓటుకు నోటు లాగే సీటుకు నోటట... రేవంత్ ఖాతాలో రూ.1190 కోట్లట..: ఫోన్ పే పోస్టర్లతో వింత ప్రచారం (వీడియో)

By Arun Kumar P  |  First Published Oct 15, 2023, 11:41 AM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ... కాంగ్రెస్  అభ్యర్థుల ప్రకటన వెలువడిన సమయంలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా హైదరాబాద్ లో వెలిసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. 


హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలతో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ప్రధాన రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్దం మరింత ముదిరి పోస్టర్స్ వార్ మొదలైంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ 55మంది అభ్యర్థులను ఖరారుచేసి మొదటి లిస్ట్ విడుదలచేసిన వేళ ప్రత్యర్థులెవరో వాల్ పోస్టర్లలో టిపిసిసి చీఫ్ పై సరికొత్త ప్రచారాన్ని ప్రారంభించారు. కొద్దిరోజులుగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకుంటున్నాడని  ప్రత్యర్థి పార్టీల నాయకులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇదే ప్రచారానికి సంబంధించిన వాల్ పోస్టర్లు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.  

ఇప్పటికే టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి 58మంది అభ్యర్థుల నుండి రూ.580 కోట్లు అందినట్లు... మరో 61 మంది నుండి రూ.610 కోట్లు తీసుకోనున్నట్లు ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు గుర్తుతెలియని వ్యక్తులెవరో ఆన్ లైన్ పేమెంట్స్ ప్లాట్ ఫారం ఫోన్ పే ద్వారా రేవంత్ ఖాతాలోకి వందలకోట్లు చేరినట్లుగా పోస్టర్లను ముద్రించారు. రాజధాని నగరం హైదరాబాద్ లో 'రేటెంత రెడ్డి' పేరిట వెలిసిన ఈ పోస్టర్లు రాజకీయ కలకలం రేపుతున్నాయి.  

Latest Videos

undefined

వీడియో

పార్టీ కోసం కష్టపడ్డ నాయకులకు కాకుండా పారాషూట్ నాయకులకు అంటే ఇతర పార్టీలనుండి వచ్చినవారికే టికెట్లు ఇస్తున్నారని కొందరు నాయకులు ఆరోపిస్తున్నారు. ఇదే అదునుగా టిపిసిసి చీఫ్ రేవంత్ కు ఇలా నాయకులను కొనడం, అమ్మడం అలవాటేనని... ఇప్పుడు కూడా ఇవే రాజకీయాలు చేస్తున్నారని ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే చాలామంది నుండి రేవంత్ కోట్లు వసూలు చేసి టికెట్లు అమ్ముకున్నాడని... మరికొందరి నుండి డబ్బులు తీసుకునేందుకు సిద్దంగా వున్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ అసెంబ్లీ ఎన్నికల ద్వారా వెయ్యికోట్లకు పైగా వసూలు చేసేందుకు సిద్దమయ్యారని జోరుగా ప్రచారం జరుగుతోంది. 

 Read More 12 మంది వలస నేతలకు కాంగ్రెస్ టిక్కెట్లు:నాగం, మర్రికి నిరాశే

అయితే ఇప్పటికే రేవంత్ రూ.580 కోట్లు వసూలు చేసినట్లు... మరో రూ.610 కోట్లు ప్రాసెసింగ్ లో వున్నట్లు ఫోన్ పే హిస్టరీ మాదిరిగా ప్రత్యర్థులు వాల్ పోస్టర్లు ఏర్పాటుచేసారు. అంటే ఒక్కో అభ్యర్థి నుండి రేవంత్ రూ.10 కోట్లు వసూలు చేస్తున్నాడనేది ఈ పోస్టర్ సారాంశం. ఇలా వందలకోట్లు రేవంత్ ఖాతాలోకి చేరినట్లు... డబ్బులిచ్చిన వారికే టికెట్లు దక్కుతున్నాయని ఆరోపిస్తున్నారు. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల టికెట్లు అమ్మడంద్వారా రేవంత్ రూ.1,190 కోట్లు సంపాదించనున్నాడంటూ ఈ వాల్ పోస్టర్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. 

టిపిసిసి చీప్ రేవంత్ ను బద్నాం చేసేందుకు అధికార బిఆర్ఎస్ ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. గతంతో ఏఐసిసి సమావేశం సమయంలోనూ ఇలాంటి పోస్టర్లతోనే దుష్ప్రచారం చేసారని అంటున్నారు. బిఆర్ఎస్ ఎంత దుష్ఫ్రచారంచేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని... ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ ను గెలింపిచాలని భావిస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. 

click me!