
మహబూబ్ నగర్ జిల్లా కోస్గిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ సృష్టించేందుకు జరిగిన ఒక కుట్రను పోలీసులు చాకచక్యంగా, శరవేగంగా భగ్నం చేశారు. ఈ దశ్చర్యకు పాల్పడిన దుండగులను అదుపులోకి తీసుకుని 24 గంటలలో సామరస్యం పునరుద్ధరించారు.
కోస్గీలో బుధవారం ఓ ప్రార్థనాలయం వద్ద చోటు చేసుకున్న అసాంఘిక చర్యతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. ఆ వర్గానికి చెందిన ప్రజలు రోడ్లపై బైఠాయించి నిరసన కూడా తెలిపారు.
అయితే, ప్రార్థనా మందిరాన్ని అపవిత్రం చేసేందుకు ఒకఅల్లరి మూక కుట్ర చేసిందన్న సమాచారం అందగానే ఎస్ పి రెమారాజేశ్వరి, అమె సిబ్బంది వెంటనే కోస్గి చేరుకుని ఈ దుశ్చర్య సమాచారం అవేశకావేశాలు సృష్టించకుడండా చర్యలు తీసుకున్నారు. అదనపు బలగాలను రప్పించి పరిస్తితి చే జారకుండా కట్టుదిట్టం చేశారు. ఇరువర్గాలను ప్రజలను సంప్రదించి, వారి సహాయంతో ఉద్రిక్తత ఏర్పడకుండా చూశారు.
ఈ అసాంఘిక చర్యకు పాల్పడిన దోషులను జిల్లా పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు.
కొత్త గణేష్, గూడెల్లి గణేష్, కొదుముల సురేశ్ లను నిందితులుగా గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ రమా రాజేశ్వరి గురువారం తెలిపారు.
ఓ ప్రార్ధనాలయంలో అసాంఘిక చర్యకు పాల్పడినట్లు నిందితులు స్వయంగా ఒప్పుకున్నట్లు ఆమె వెల్లడించారు.
కాగా, నిందితులను పట్టుకోవడానికి ఎస్పీ బుధవారమే ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపారు. కోస్గీలో పరిస్థితిని దగ్గరుండి సమీక్షించారు.
ప్రస్తుతం అక్కడ పరిస్థితి పూర్తిగా అదుపులో ఉన్నట్లు డీఎస్పీ ప్రకటించారు.