
శాసనసభ శీతాకాల సమావేశాల అజెండా ఖరారైంది. అసెంబ్లీ కమిటీ హాలులో స్పీకర్ మధుసూదనాచారి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల అజెండాపై చర్చించారు.
ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు 16 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ నెల 30 వరకు సమావేశాల అజెండాను ఖరారు చేశారు.
16 న పెద్ద నోట్ల రద్దు, తర్వాత పరిణామాలపై చర్చించనున్నారు. 24, 25న క్రిస్మస్ సందర్భంగా సెలవు.
ఈ నెల 30 తర్వాత మరోసారి బీఏసీ సమావేశం కానుంది. జనవరిలో సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు.
శుక్రవారం 10 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బీఏసీ సమావేశానికి సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్యేలు జానారెడ్డి, భట్టి విక్రమార్క, సున్నం రాజయ్య, సండ్ర వెంకటవీరయ్య, అక్బరుద్దీన్ ఓవైసీతో పాటు ఇతర నేతలు హాజరయ్యారు.