బండి సంజయ్‌తో మాట్లాడా: కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్, సీఎంఓ ఆరా

By narsimha lodeFirst Published Nov 17, 2019, 1:18 PM IST
Highlights

కరీంనగర్ కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మధ్య ఆడియో సంభాషణకు సంబంధించిన విషయమై సీఎంఓ ఆరా తీస్తోంది. బండి సంజయ్ తో తాను మాట్లాడిన విషయం వాస్తవమేనని కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ ప్రకటించారు.

కరీంనగర్: మంత్రి గంగుల కమలాకర్‌ ఎన్నికల వ్యయంపై తెలంగాణ సీఎం కేసీఆర్ సీరియస్‌గా తీసుకొన్నారని సమాచారం. ఈ ఘటనపై సీఎంఓ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ విషయమై కరీంనగర్ కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్‌ను అడిగినట్టుగా తెలుస్తోంది.

Also read:ఆడియో టేపుల వివాదం: కుట్రలో ఎవరెవరున్నారో తేలాలన్న గంగుల

మంత్రి గంగుల కమలాకర్‌ ఎన్నికల ఖర్చు విషయమై (ప్రస్తుత కరీంనగర్ ఎంపీ) అప్పటి కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్, కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్‌ మధ్య జరిగిన సంభాషణకు సంబంధించి ఆడియో టేపులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్నికల ఫలితాల తర్వాత  బండి సంజయ్ కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్‌తో మాట్లాడినట్టుగా ఈ సంభాషణల్లో ఉంది.

read also:మన సంగీత దర్శకుల రెమ్యునరేషన్.. ఒక్క సినిమాకు ఎంత తీసుకుంటారో తెలుసా?

ఈ ఆడియో టేపు సోఫల్ మీడియాలో వైరల్‌గా మారడంతో  ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్‌ను వివరణ కోరినట్టుగా తెలిసింది.అయితే ఈ విషయమై ప్రభుత్వానికి సర్పరాజ్ అహ్మద్ తన వాదనను విన్పించినట్టుగా తెలుస్తోంది.

ఖర్చుల గురించి బండి సంజయ్ తనతో మాట్లాడిన విషయం వాస్తవవమేనని కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ చెప్పారు. నియమ నిబంధనల ప్రకారంగానే తాను ఎన్నికల నిధులను అప్‌లోడ్ చేస్తానని స్పష్టం చేసినట్టుగా సర్పరాజ్ అహ్మద్ చెప్పారని సమాచారం.

బయటపడ్డ సంచలన ఆడియో.. బండి సంజయ్‌పై టీఆర్‌ఎస్ మంత్రి ఫైర్ 

తాను బండి సంజయ్‌తో మాట్లాడిన విషయాలను తన  ఉన్నతాధికారులకు చెబుతానని కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ చెప్పారు. ఈ మేరకు ఆదివారం నాడు ఓ తెలుగు న్యూస్ ఛానెల్ ఈ విషయాన్ని ప్రకటించింది. 

కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా గంగుల కమలాకర్, బీజేపీ అభ్యర్ధిగా బండి సంజయ్, కాంగ్రెస్ అభ్యర్ధిగా పొన్నం ప్రభాకర్ పోటీ చేశారు. ఈ ముగ్గురు అభ్యర్ధుల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి గంగుల కమలాకర్  విజయం సాధించారు.

ఈ ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్నికల వ్యయంపై బండి సంజయ్  కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్‌తో ఫోన్‌లో మాట్లాడినట్టుగా ఈ ఆడియో సంభాషణను బట్టి తేలింది. అయితే ఈ విషయమై సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేసినట్టుగా మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు.ఈ విషయమై ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తోందో చూడాలి.కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.  

ఈ ఆఢిొయో విషయమై మంత్రి గంగుల కమలాకర్ కూడ స్పందించారు.చ తనను ఓడించేందుకు తెర వెనుక ఎంతో కుట్ర జరిగిన విషయాన్ని ఈ ఆడియో టేపులు బహిర్గతం చేసినట్టుగా ఆయన అభిప్రాయపడడారు.ఈ కుట్ర వెనుక ఎవరెవరున్నారనే విషయం తేలాల్సిన అవసరం ఉందని మంత్రి కమలాకర్ అభిప్రాయపడ్డారు. 


 

click me!