TS Assembly: 80 వేల పుస్తకాలు చదివిన మేధావి.. అసెంబ్లీలో కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్

By Mahesh K  |  First Published Feb 9, 2024, 4:13 PM IST

తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆయన సభకు రాకపోవడం సభా మర్యాదను తగ్గించడమేనని అన్నారు. ఆయన సీటు ఖాళీగా ఉంచడం సభకు శోభను ఇస్తుందా? అని అడిగారు.
 


CM Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కేసీఆర్ పై విమర్శలు సంధించారు. తెలంగాణ ఎన్నికల్లో ప్రజలు మార్పును కోరుకున్నారని అన్నారు. బీఆర్ఎస్ పాలకుల అడ్డగోలుతనాన్ని వ్యతిరేకించారని వివరించారు. అందుకే బీఆర్ఎస్ పార్టీని ప్రతిపక్షానికి పరిమితం చేశారని తెలిపారు. అయితే.. బీఆర్ఎస్ పార్టీని అధికారానికి దూరం పెట్టినా.. ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యతలు అప్పగించారు. ప్రజలు కట్టబెట్టిన ఆ బాధ్యతను బీఆర్ఎస్ పార్టీ నెరవేర్చాలి గదా .. అని ప్రశ్నించారు.

కేసీఆర్‌ను ప్రధాన ప్రతిపక్ష నేత అని పేర్కొంటూ రేవంత్ రెడ్డి పరోక్షంగా ప్రస్తావించారు. ప్రధాన ప్రతిపక్ష నేతకు ఉన్న రాజకీయ అనుభవాన్ని, పాలన అనుభవాన్ని రాష్ట్ర ప్రజల కోసం ఉపయోగించాల్సింది అని, కానీ, ఆయన సభకు రాకపోవడం బాధాకరం అని పేర్కొన్నారు. అత్యధిక పుస్తకాలు చదివిన, 80 వేల పుస్తకాలు చదివిన మహా మేధావి అని చెప్పుకుంటారు కదా.. వారు అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడమో... తప్పిదాలు ఉంటే సరిచేయడమో చేయాలి కదా.. అని మండిపడ్డారు.

Latest Videos

Also Read: తెలంగాణలో అధికారుల ఆస్తుల చిట్టా బయటికి... HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ వాంగ్మూలంలో సంచలనాలు

అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత సీటు ఖాళీగా ఉండటం సభా మర్యాదను తగ్గిస్తుందని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. తమ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా అనుకూల నిర్ణయాలను ప్రతిపక్షం స్వాగతిస్తుందని అనుకున్నామని, కానీ, వారి నుంచి అలాంటి స్పందన రాలేదని వివరించారు.

click me!