పీ.వీ.నరసింహారావు: నెహ్రు-గాంధీయేతర ఫ్యామిలీ నుండి ప్రధానిగా

Published : Feb 09, 2024, 03:05 PM IST
పీ.వీ.నరసింహారావు: నెహ్రు-గాంధీయేతర ఫ్యామిలీ నుండి ప్రధానిగా

సారాంశం

నెహ్రు, గాంధీ కుటుంబం నుండి కాకుండా  కాంగ్రెస్ పార్టీలో  ప్రధాన మంత్రి పదవిని పొందిన  ఏకైక వ్యక్తి  పీ.వీ. నరసింహారావు రికార్డు సృష్టించారు.

హైదరాబాద్: నెహ్రు, గాంధీ కుటుంబం నుండి కాకుండా  కాంగ్రెస్ పార్టీ తరపున ప్రధాన మంత్రి పదవిని పొందిన తెలుగు వ్యక్తి పీ.వీ. నరసింహారావు. 
1991లో   నూతన ఆర్ధిక విధానాలకు  పీ.వీ. నరసింహారావు సర్కార్  శ్రీకారం చుట్టింది.ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన అన్ని ప్రభుత్వాలు ఈ సంస్కరణలను కొనసాగించిన పరిస్థితి నెలకొంది.

పాములపర్తి వెంకట నరసింహారావు (పీ.వీ.నరసింహారావు) 1991-1996 వరకు భారత ప్రధాన మంత్రిగా పనిచేశారు.1991లో  భారత దేశం విదేశీ నిల్వల సంక్షోభాన్ని ఎదుర్కొంది.ఈ సమయంలో  పీ.వీ. నరసింహారావు  ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ పేరుతో ఆర్ధిక సంస్కరణలను తీసుకు వచ్చారు.

పీ.వీ. నరసింహారావే దక్షిణాది ప్రాంతం నుండి ప్రధాన మంత్రి పదవిని చేపట్టిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. కాంగ్రెస్ పార్టీలో సుధీర్ఘకాలం పాటు ఆయన కొనసాగారు.  ఇందిరాగాంధీకి  మంచి విశ్వాసపాత్రుడిగా  పీ.వీ. నరసింహారావుకు  పేరుంది.1969లో  కాంగ్రెస్ పార్టీ చీలిపోయిన సమయంలో  ఆయన  ఇందిరాగాంధీకి మద్దతుగా నిలిచారు.

also read:ఆర్ధిక సంస్కరణలకు ఆద్యుడు పీ.వీ. నరసింహారావు: 1991 లో ఏం జరిగిందంటే?

1991లో  రాజీవ్ గాంధీ హత్య తర్వాత పీ.వీ.నరసింహారావు  తిరిగి క్రియాశీలక రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. పీ.వీ. నరసింహారావుకు  భారత రత్నను  కేంద్ర ప్రభుత్వం ఇవాళ  ప్రకటించింది. పీ.వీ. నరసింహారావు దేశానికి చేసిన సేవలను  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గుర్తు చేసుకున్నారు.నెహ్రు, గాంధీ కుటుంబం నుండి కాకుండా కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రధాన మంత్రి పదవిని పొందిన వ్యక్తి పీ.వీ. నరసింహారావు.ఐదేళ్ల పాటు  ప్రధాని పదవిలో పీ.వీ. నరసింహారావు కొనసాగారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే
School Holidays : ఈ గురువారం స్కూళ్ళకు సెలవేనా..? ఎందుకో తెలుసా?