Musi rejuvenation: థేమ్స్ తరహాలో మూసి : CM రేవంత్ రెడ్డి

Published : Jan 20, 2024, 07:01 AM IST
Musi rejuvenation: థేమ్స్ తరహాలో మూసి : CM రేవంత్ రెడ్డి

సారాంశం

Musi rejuvenation: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం నాడు తన లండన్ పర్యటనను ప్రారంభించారు. థేమ్స్ నదిని పర్యవేక్షించే ప్రధాన సంస్థ అయిన పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ ప్రతినిధులు, నిపుణులతో మూడు గంటలపాటు చర్చలు జరిపారు.  మూసీ నదిని పునరుజ్జీవింపజేయడానికి తన ప్రణాళికలను పంచుకున్నారు.

Musi rejuvenation:హైదరాబాద్ నడిబొడ్డున గల మూసీ నది ప్రక్షాళన(Musi Rejuvenation)పై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు దావోస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తన టీంతో కలసి  పోర్ట్ ఆఫ్ లండన్ అధికారులు, థేమ్స్ నది పాలకమండలి అధికారులు, నిపుణులతో మూడు గంటలపాటు  భేటీ అయ్యారు. మూసీ నది పునరుజ్జీవనం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలను వారితో చర్చించారు.

ఈ భేటీలో మూసీ నదిని పునరుజ్జీవింపజేసే ప్రయత్నంలో తెలంగాణ ప్రభుత్వానికి అన్ని సహాయ సహకారాలు అందిస్తామని థేమ్స్ నది పాలక సంస్థ పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ హామీ ఇచ్చింది. లండన్‌కు వెళ్లడానికి అతనికి థేమ్స్ నది ప్రక్షాళన ప్రేరణగా నిలిచిందని సీఎం రేవంత్ తెలిపారు. మూసీ నదిని పునరుజ్జీవింపజేసే ప్రయత్నాలలో పూర్తి మద్దతుతో ముందుకు సాగడానికి అత్యున్నత అధికారులు తెలంగాణ ప్రభుత్వానికి హామీ ఇచ్చారు. అనేక సాధ్యమైన సహకార అంశాలపై  మరింత సమగ్రమైన చర్చ జరిగింది. 

మూసీనది పునరుద్ధరణ, సుందరీకరణ చేయడం ద్వారా హైదరాబాద్ నగరంలోని ప్రజలకు, చెరువులకు నీటి సరఫరా సులభం అవుతుందనీ, అదే విధంగా ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ నేథ్యంలోనే మూసీ నది మొత్తం పరీవాహక ప్రాంతాన్ని ఉపాధి, ఆర్థికాభివృద్ధి మండలంగా తీర్చిదిద్దాలని కొద్దిరోజుల క్రితం అధికారుల సమావేశంలో సీఎం రేవంత్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఇక ఇదే అంశంపై నేడు పోర్ట్ ఆఫ్ లండన్ అధికారులతో చర్చలు జరిపారు. మూసీ నది ప్రక్షాళనకు వారి సహకారం ఉంటుందని అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి హామీ ఇచ్చారు.
 
“నదులు, సరస్సులు లేదా సముద్రంతో పాటు భూమిపై ఉన్న చాలా నగరాలు చారిత్రాత్మకంగా అభివృద్ధి చెందాయి. నీటి వనరులు పట్టణ మానవ ఆవాసాలకు శక్తినిచ్చే, జీవనాధార శక్తులు. హైదరాబాద్ మూసీ నది వెంట అభివృద్ధి చెందింది. అయితే హుస్సేన్‌సాగర్ సరస్సు చుట్టూ కేంద్రీకృతమై ఉస్మాన్‌సాగర్ వంటి ఇతర ప్రధాన నీటి వనరుల ద్వారా అభివృద్ధి చెందడం ప్రత్యేకత. మూసీని పునరుజ్జీవింపజేసి, పూర్తి స్థాయిలో తిరిగి తీసుకొచ్చిన తర్వాత.. హైదరాబాద్ నది , సరస్సుల ద్వారా శక్తిని పొందుతుంది, ”అని ముఖ్యమంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం ప్రత్యేక కార్యదర్శి బీ అజిత్‌రెడ్డి, హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) జాయింట్‌ కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
IMD Cold Wave Alert : ఇక తెలంగాణలో 5°C టెంపరేచర్స్.. ఈ ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్