Numaish: సామాజిక బాధ్యతతో అనేక విద్యాసంస్థలను నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ సొసైటీకి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సొసైటీ యాజమాన్యంలోని కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజినీరింగ్ కళాశాలగా అప్‌గ్రేడ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.
Numaish: హైదరాబాద్ కా నిషాన్ 'నుమాయిష్' అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ అంటే చార్మినార్, ట్యాంక్ బండ్ తరువాత గుర్తొచ్చేది నుమాయిష్ అని పేర్కొన్నారు. సోమవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో 83వ నుమాయిష్ ను ప్రారంభించిన తర్వాత సీఎం ప్రసంగించారు. ప్రతీ ఏటా నుమాయిష్ ప్రాధాన్యత తగ్గకుండా నిర్వహిస్తున్న సొసైటీని సీఎం ఈ సందర్భంగా అభినందించారు.
సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజీని ఇంజనీరింగ్ కాలేజీగా అప్ గ్రేడ్ చేయడానికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. సామాజిక బాధ్యతతో విద్యా సంస్థలను నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ సొసైటీకి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ కు గుర్తింపు తెచ్చేందుకు నుమాయిష్ ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
undefined
ప్రతి సంవత్సరం 45 రోజుల పాటు నిర్వహించే ఎగ్జిబిషన్ ప్రతిష్టను కాపాడుతున్నందుకు ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ సొసైటీని అభినందించారు, హైదరాబాద్ నుమాయిష్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సొసైటీకి అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఎగ్జిబిషన్ సొసైటీ వార్షిక ఎగ్జిబిషన్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం క్రియాశీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ని పెంచేందుకు సొసైటీ పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామాని, పారిశ్రామిక రంగంలో మహిళా పారిశ్రామికవేత్తలను కూడా ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. ప్రదర్శనలో మహిళలు ప్రదర్శించిన పలు కళాఖండాలను ఆయన అభినందించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి, ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు డి శ్రీధర్ బాబు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.
ప్రత్యేకతలు
ఎగ్జిబిషన్‌లో ఈ సంవత్సరం 2,000 స్టాల్స్ ఉన్నాయి. ఇది వారాంతపు రోజులలో సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 11.00 గంటల వరకు సందర్శకుల కోసం తెరిచి ఉంటుంది. ప్రవేశ టికెట్ ధర రూ.40. ఈ ఏడాది 25 లక్షల మంది సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్‌లో జనవరి 9, 31 తేదీల్లో ప్రత్యేకంగా మహిళలు, పిల్లలకు రెండు రోజులు కేటాయించారు. నగరంలోని ప్రముఖ ఫుడ్ అవుట్‌లెట్‌లు స్టాల్స్‌ను ఏర్పాటు చేయగా, డ్వాక్రా, టిమెరిస్, జైళ్ల శాఖ, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, ట్రాఫిక్ పోలీసులతో పాటు ప్రభుత్వ సంస్థల స్టాల్స్ కూడా ఉన్నాయి.