తెలంగాణ ముఖ్యమంత్రికి పదవీగండం ఉన్నదని జ్యోతిష్కుడు వేణుస్వామి తెలిపారు. ఏపీలో మళ్లీ వైసీపీ ప్రభుత్వమే వస్తుందని అన్నారు. తెలంగాణలో మాజీ మంత్రులు లేదా మాజీ ఎమ్మెల్యేలు పదుల సంఖ్యలో జైలు పాలయ్యే అవకాశాలు ఉన్నాయని వివరించారు.
Venu Swamy: జ్యోతిష్కుడు వేణుస్వామి ఈ ఏడాదిలో జరగబోయే రాజకీయ పరిణామాలపై జోస్యం చెప్పారు. ఇందులో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకునే ప్రధాన రాజకీయ పరిణామాలను పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పదవీగండం ఉన్నదని జోస్యం చెప్పారు. కాబట్టి, ఆయన అందుకు తగిన జాగ్రత్తలు చేసుకోవాలని అన్నారు. అందుకు సంబంధించిన ఆలోచనలు చేసుకోవడం ఉత్తమం అని సూచనలు చేశారు.
అంతేకాదు, తెలంగాణలో పదుల సంఖ్యలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు జైలుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని వేణు స్వామి తెలిపారు. వ్యాపారవేత్తలు, బ్యూరోక్రాట్లు కూడా జైలుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే, తెలంగాణలో ఓ ముఖ్యనేత కొడుకు, యువనేత వ్యక్తిగత జీవితం సంచలనంగా మారే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. అక్కడ మళ్లీ వైసీపీ ప్రభుత్వమే ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. మరో మూడు నెలల్లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దేశంలో ఒక ముఖ్యమంత్రికి, ఇద్దరు డిప్యూటీ సీఎంలకు ఆరోగ్య భంగములు కనిపిస్తున్నాయని వివరించారు.
Also Read: Congress: కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు.. అసెంబ్లీకైతే అస్త్రాలు, పార్లమెంటుకు అగ్నిపరీక్షేనా?
ఇక ప్రపంచస్థాయి పరిణామాల గురించి చెబుతూ వేణు స్వామి ఓ హెచ్చరిక చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఓ మహమ్మారి రాబోతున్నదని అన్నారు. అది ఏదో ఒక రోగం లేదా.. కరోనా రూపంలో లేదా మరే రూపంలోనైనా ఒక ఉపద్రవం రాబోతున్నదని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడో ఓ చోట ఇది వస్తుందని తెలిపారు. అయితే, మన దేశంలో దాని తీవ్రత కొంచెం తక్కువగా ఉండే చాన్స్ ఉన్నదని వివరించారు.