లెఫ్ట్ పార్టీల వైపు సీఎం కేసీఆర్ చూపు..? బీజేపీని ఎదుర్కోవాలంటే వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలనే ఆలోచన.. ?

By team teluguFirst Published Dec 5, 2022, 10:57 AM IST
Highlights

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ లెఫ్ట్ పార్టీలతో కలసి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇటీవల జరిగిన మునుగోడు ఎన్నికల్లో ధీటుగా పోటీ ఇచ్చిన బీజేపీని ఎదుర్కోవాలంటే.. అలాగే జాతీయ స్థాయి రాజకీయాల్లో రాణించాలంటే వామపక్షాల అవసరం ఉంటుందని సీఎం ఆలోచిస్తున్నారు. 

తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త ఆలోచనలో పడ్డారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇటీవల జరిగిన మునుగోడు ఎన్నికల్లో ఎదురైన అనుభవాల వల్ల ఈ పొత్తు తప్పడం లేదని తెలుస్తోంది.నవంబర్ 3న మునుగోడులో జరిగిన ఉప ఎన్నికల్లో సీపీఐ, సీపీఎంలు టీఆర్‌ఎస్‌కు అందించిన మద్దతు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డికి ఓటమిని కలిగించడంలో కీలకంగా మారింది. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీని ఎదురించాలంటే లెఫ్ట్ పార్టీలతో కలిసి నడవాలని సీఎం ఆలోచిస్తున్నట్టు అర్థమవుతోంది.

మహిళపై సామూహిక అత్యాచారం, సిగరెట్ తో ప్రైవేట్ భాగాల్లో కాల్చి, కత్తితో గాట్లు పెట్టి చిత్రహింసలు..

బీజేపీకి వ్యతిరేకంగా ఉండేవారితో కలిసి నడుస్తామని జాతీయ స్థాయిలో పొత్తులపై రెండు వామపక్ష పార్టీల నాయకులు పిలుపునిచ్చారు. అలాగే రాష్ట్ర స్థాయిలో ఎన్నికల పొత్తులపై నిర్ణయం తీసుకునే బాధ్యతను ఆయా రాష్ట్ర నాయకత్వాలకే వదిలేశారు. భారత రాష్ట్ర సమితిని ప్రారంభించిన ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయ ఆకాంక్షల దృష్ట్యా 2023 ఎన్నికల్లో గెలవాలంటే వామపక్షాలు అవసరం ఉందని మునుగోడు ఫలితం గుర్తించిందని రాజకీయ విశ్లేషకులు చెప్పారని ‘డెక్కన్ క్రానికల్’ నివేదించింది.

మహాకాల్ ఆలయంలో మహిళల డ్యాన్స్ వీడియో వైరల్... ఇద్దరు సెక్యురిటీ సిబ్బంది సస్పెండ్..

ఒక వేళ  సీపీఐ, సీపీఎంలతో పొత్తుపెట్టుకొని ఎన్నికలకు వెళితే ఆయా పార్టీలకు ఎన్ని సీట్లు ఇవ్వాలన్నది సీఎం కేసీఆర్ ముందు ఉన్న అతి పెద్ద సవాల్. కానీ 2023 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు సీపీఐ, సీపీఎంల మద్దతు కచ్చితంగా అవసరం. అధికార వ్యతిరేకత, బీజేపీ ఓట్ల పోలరైజింగ్‌ రాజకీయాలు టీఆర్ఎస్ కు పెద్ద సవాల్‌గా మారాయి. ‘‘ఒక్కో నియోజకవర్గం నుంచి వచ్చిన సర్వే నివేదికల ఆధారంగా తమ పార్టీపై వచ్చిన వ్యతిరేకత సీఎం కేసీఆర్ కు తెలుసు. కాబట్టి ఆయన సీపీఐ, సీపీఎంతో సీట్లు పంచుకుంటారని భావిస్తున్నాం.’’ అని టీఆర్‌ఎస్‌ సీనియర్‌ ఒకరు చెప్పారని ‘డెక్కన్ క్రానికల్’కథనం నివేదించింది. 
 

click me!