ఆయన బాట నేటీకీ స్ఫూర్తిదాయకం: సీఎం కేసీఆర్‌

Published : Apr 11, 2023, 02:28 PM IST
ఆయన బాట నేటీకీ స్ఫూర్తిదాయకం: సీఎం కేసీఆర్‌

సారాంశం

అన్ని రంగాల్లో దేశ ప్రజలంతా  సమానత్వంతో జీవించాలంటూ ఆధిపత్య శక్తులకు వ్యతిరేకంగా పోరాడిన సామాజిక తత్వవేత్త మహాత్మా జ్యోతిరావు గోవిందరావు ఫూలే ఆశయాలు నేటికీ స్పూర్తిదాయకమని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

అన్ని రంగాల్లో ప్రజలు సమానత్వంతో జీవించాలంటూ ఆధిపత్య వర్గాలకు వ్యతిరేకంగా పోరాడిన సామాజిక కార్యకర్త, తత్వవేత్త మహాత్మా జ్యోతిరావు గోవిందరావు ఫూలే ఆశయాలు నేటికీ స్పూర్తిదాయకమని తెలంగాణ సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. నేడు మహాత్మా జ్యోతిబా ఫూలే 197వ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ దేశ చేసిన సేవలు, త్యాగాలను స్మరించుకున్నారు. 

పూలే... వర్ణ, లింగ వివక్షకు వ్యతిరేకంగా బహుజన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారని గుర్తుచేశారు. ఫూలే ఆదర్శాలు నచ్చి.. బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ స్వయంగా తన గురువుగా ప్రకటించుకున్నారని తెలిపారు. ఆ మహనీయుల ఆశయాలను నెరవేర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తన ప్రాధాన్యతాక్రమంలో అభివృద్థి సంక్షేమ కార్యాచరణను అమలు చేస్తోందని అన్నారు. జ్యోతిబా ఫూలే సూచించిన ‘వికాసమే వివక్షకు విరుగుడు’ అనే విధానాన్ని అనుసరిస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికోసం  రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతోందని అన్నారు. దేశంలో గుణాత్మక మార్పులు తీసుకరావడం కోసం..దళిత బహుజనులు ఉద్యమించేలా ఫూలే కార్యాచరణ పురికొల్పిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాల్లో అధిక శాతం బహుజన బిడ్డలే లబ్థి పొందుతున్నారని  సీఎం పేర్కొన్నారు. వారు   దళితబంధు, షెడ్యూల్డ్ కులాలు, తెగల ప్రత్యేక ప్రగతినిధి, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్, ఎస్సీలకు నైపుణ్య శిక్షణ, ఎస్సీలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, షెడ్యూల్డ్ తెగల ప్రత్యేక ప్రగతి నిధి, పారిశ్రామికవేత్తలకు అండగా టీఎస్ ప్రైడ్, ఎస్టీలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, గిరిజనులకు ఆత్మగౌరవ భవనాలు, గ్రామ పంచాయతీలుగా గిరిజన తండాలు వంటి అనేక కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తుందనీ, ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీల ప్రగతి కోసం అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు.  జ్యోతిబా ఫూలే ఆశయ సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు గురుకుల విద్యతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్టు వివరించారు.ఈ దేశంలో మనుషులంతా అన్ని రంగాల్లో సమానత్వంతో జీవించాలని, ఆయన ఆధిపత్య శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ తన జీవితాన్ని జాతికి ధారపోశారని అన్నారు.

అదే సందర్భంలో.. బీసీల అభివృద్ధికి మహాత్మా జ్యోతిబా ఫూలే విదేశీ విద్యా నిధి, బీసీ గురుకులాలు, గొర్రెల పంపిణీ, బెస్త, ముదిరాజ్ వర్గాల ఉపాధి కోసం చెరువుల్లో చేపల పెంపకం, బీసీలకు ఆత్మగౌరవ భవనాలు, కల్లుగీత, చేనేత, మత్స్యకారులకు ప్రమాద బీమా, పునరుద్ధరణ కల్లు దుకాణాలు, కల్లుగీత కార్మికులకు ప్రత్యేక సంక్షేమ పథకాలు, నేత కార్మికులకు సహాయం, సెలూన్లకు ఉచిత విద్యుత్, చాకలివారికి ఆధునిక లాండ్రీ మిషన్లు , ధోబీ ఘాట్‌ల నిర్మాణం కూడా పేదల సంక్షేమం కోసం అమలు చేయబడుతున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. మహాత్మా ఫూలే ఆశయాలు తెలంగాణ ప్రభుత్వానికి స్ఫూర్తిదాయకమని పునరుద్ఘాటించిన సీఎం కేసీఆర్ .. తెలంగాణ దేశంలోనే రోల్ మోడల్‌గా నిలిచిందని, అన్ని వర్గాల సమానత్వ భావనను ఆవిష్కరించేలా ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తుందని చెప్పారు.  

PREV
click me!

Recommended Stories

Telangana : మూడో విడత పంచాయతీ పోలింగ్ ప్రారంభం
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!