హైద్రాబాద్‌ కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్: రోజూ కోట్ల రూపాయాల లావాదేవీలు

By narsimha lode  |  First Published Apr 11, 2023, 1:37 PM IST

క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న  10 మంది  సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్  చేశారు. 


హైదరాబాద్: ఐపీఎల్  తో పాటుఅంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లపై బెట్టింగ్  పాల్పడుతున్న  10 మంది సభ్యుల  ముఠాను సైబరాబాద్  పోలీసులు  అరెస్ట్  చేశారు. మంగళవారంనాడు  సైబరాబాద్  సీపీ  స్టీఫెన్  రవీంద్ర  తన  కార్యాలయంలో  మీడియాతో మాట్లాడారు.  హైద్రాబాద్  లో  కాల్ సెంటర్  ను  ఏర్పాటు  చేసి బెట్టింగ్  పాల్పడుతున్నారని  పోలీసులు  చెప్పారు.  

ఈ కాల్ సెంటర్ ద్వారా  కోట్లాది  రూపాయాలు  దండుకుంటున్నారని  పోలీసులు  చెప్పారు.ఐపీఎల్  తో పాటు , అంతర్జాతీయ  క్రికెట్  మ్యాచ్ లపై  కూడా  ఈ ముఠా బెట్టింగ్  కు పాల్పడుతుందని  పోలీసులు  చెప్పారు. క్రికెట్  బెట్టింగ్  కు పాల్పడుతున్న వారిలో  10 మందిని  అరెస్ట్  చేసినట్టుగా  పోలీసులు  ప్రకటించారు.  హైద్రాబాద్  శివారు ప్రాంతం  వేదికగా  బెట్టింగ్  కార్యకలాపాలు  నిర్వహిస్తున్నారని  పోలీసులు ప్రకటించారు.

Latest Videos

 గతంలో  కూడా  క్రికెట్ బెట్టింగ్ లకు  పాల్పడుతున్న పలువురిని  పోలీసులు  అరెస్ట్  చేశారు. రెండు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లాలోని  షాద్  నగర్ లో  ఐపీఎల్  క్రికెట్ బెట్టింగ్  కు పాల్పడుతున్ న ముఠాను  ఎస్‌ఓటీ  పోలీసులు అరెస్ట్  చేశారు. క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ఏడుగురిని  పోలీసులు  అరెస్ట్  చేశారు. నిందితుల  నుండి  రూ. 1.15 లక్షలను  స్వాధీనం చేసుకున్నారు.

గత ఏడాది  అక్టోబర్  21న  పోలీసులు  క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న   నలుగురిని  పోలీసులు అరెస్ట్  చేశారు. హైద్రాబాద్ ఎల్ బీ నగర్ లో క్రికెబట్ బెట్టింగ్ కు పాల్పడుతున్నట్టుగా  పోలీసులు గుర్తించారు.  బెట్టింగ్ కు  పాల్పడుతున్న  వారిని పోలీసులు అరెస్ట్  చేశారు. 
 

click me!