Dharani portal: ధరణి పోర్టల్ పై సీఎం కేసీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు..

By Mahesh Rajamoni  |  First Published Jul 26, 2023, 2:40 PM IST

Hyderabad: ధరణి పోర్టల్ వల్ల తెలంగాణ పల్లెలు ప్రశాంతంగా ఉన్నాయని రాష్ట్ర ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) అన్నారు. ధరణి పోర్టల్ లేకపోతే రకరకాల హత్యలు జరిగేవ‌నీ, పోర్టల్ ప్రవేశపెట్టడంతో రైతు తప్ప మరెవరూ భూమి యాజమాన్యాన్ని మార్చలేరని పేర్కొన్నారు.
 


Telangana chief minister K Chandrasekhar Rao: ధ‌ర‌ణి పోర్ట‌ల్ పై ప్ర‌తిప‌క్షాలు ప‌లు ర‌కాలు అనుమానాలు వ్య‌క్తం చేస్తూ  ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తూనే ఉన్నాయి. ఇప్ప‌టికే ఈ పోర్ట‌ల్, ప్ర‌భుత్వ భూములు విష‌యంలో అధికార పార్టీ నేత‌లు,  ప్ర‌తిప‌క్ష నాయ‌కుల మ‌ధ్య మాట‌ల య‌ద్ధం జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలోనే ధరణి పోర్టల్ వల్ల రాష్ట్రంలోని గ్రామాలు ప్రశాంతంగా ఉన్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) అన్నారు. ధరణి ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ అనేది తెలంగాణలో వ్యవసాయ, వ్యవసాయేతర ప్రభుత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్ కు సంబంధించిన అధికారిక పోర్టల్.

తెలంగాణలో భూముల విలువ పెరిగింద‌ని కూడా కేసీఆర్‌ అన్నారు. ధరణి పోర్టల్‌ లేకుంటే రకరకాల హత్యలు జరిగి ఉండేవనీ, పోర్టల్‌ను ప్రవేశపెట్టడంతో, రైతు తప్ప ఎవరూ భూమి యాజమాన్యాన్ని మార్చలేరని పేర్కొర్కొన్నారు. దీంతో భూముల ధరలు పెరిగినా రాష్ట్రంలోని గ్రామాలన్నీ ప్రశాంతంగా ఉన్నాయ‌ని తెలిపారు. ధరణి పోర్టల్‌ వల్ల రైతులకు మూడు రకాలుగా మేలు జరుగుతుందని తెలిపారు. "భూ రికార్డులు భద్రంగా ఉన్నాయి, రైతు బంధు-వరి సేకరణ మొత్తాలు నేరుగా రైతుల ఖాతాలలో జమ చేయబడతాయి.. రైతులు ఇకపై ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్ళడం లేదు" అని ఆయన చెప్పారు.

Latest Videos

తెలంగాణలో మొత్తం భూములు 2.75 కోట్ల ఎకరాలు, అందులో 1.56 కోట్ల ఎకరాలు ధరణి పోర్టల్‌లో ఉన్నాయి అని కేసీఆర్ తెలిపారు. ఒకట్రెండు సమస్యలున్నాయనీ, ఉన్నతాధికారులకు రిప్రజెంటేషన ఇస్తే పరిష్కరించుకోవచ్చని చెప్పిన కేసీఆర్.. ఇలాంటి చిన్నచిన్న సమస్యలను పెద్ద సమస్యలుగా చూపించేందుకు కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయన్నారు.

రూ.80 వేల కోట్లతో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గురించి కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రాజెక్టు వ్యయం కంటే రైతులు పండించిన వరిధాన్యం విలువ ఇప్పుడు చాలా ఎక్కువగా ఉండడంతో రాష్ట్రానికి మొత్తం డబ్బు తిరిగి వచ్చిందన్నారు. భోంగీర్‌, ఆలేరుకు త్వరలో సాగునీరు అందిస్తామనీ, బస్వాపూర్‌ రిజర్వాయర్‌ నుంచి నీరు అందిస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు.

click me!