రాష్ట్రంలో ఒకేసారి సామూహిక జాతీయ గీతాలాపన: ఆబిడ్స్ లో పాల్గొన్న కేసీఆర్

By narsimha lodeFirst Published Aug 16, 2022, 11:30 AM IST
Highlights

స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం నాడు హైద్రాబాద్  ఆబిడ్స్ లో నిర్వహించిన సామూహిక జాతీయ గీలాపన కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. 

హైదరాబాద్: స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవాలను పురస్కరంచుకొని మంగళవారం నాడు హైద్రాబాద్ ఆబిడ్స్ సెంటర్ లో నిర్వహించిన సామూహిక జాతీయ గీలాపన కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.  ఇవాళ ఉదయం ప్రగతి భవన్ నుండి సీఎం కేసీఆర్ నేరుగా ఆబిడ్స్ కు చేరుకున్నారు. ఆబిడ్స్ లోని జీపీఓ వద్ద ఉన్న  జవహర్ లాల్ నెహ్రు విగ్రహం వద్ద తొలుత నివాళులర్పించారు. ఉదయం 11:30 గంటలకు సామూహిక జాతీయ గీలాపన కార్యక్రమం  ప్రారంభమైంది. ఇదే సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక జాతీయ గీలాపన కార్యక్రమాన్ని చేపట్టారు.,

రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక జాతీయ గీలాపన కార్యక్రమాన్ని పురస్కరించుకొని రోడ్లపై నిమిషం పాటు నాలుగు రోడ్ల కూడలి వద్ద రోడ్లపైనే వాహనాలను నిలిపివేశారు. మెట్రో రైళ్లు కూడా జాతీయ గీతాలాపన జరిగే సమయంలో  నిలిచిపోయాయి. 

75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 22వ తేదీ వరకు పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ నెల 22న లాల్ బహదూర్ స్టేడియంలో  ముగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఎంపీ కేశవరావు ప్రకటించారు.

click me!