Munugode bypoll 2022 : టిఆర్ఎస్ ఎంపీపీ తాడూరి వెంకటరెడ్డి ఇంటివద్ద అర్థరాత్రి హై డ్రామా..

By Bukka SumabalaFirst Published Aug 16, 2022, 11:06 AM IST
Highlights

మునుగోడు కేంద్రంగా రాజకీయాలు అనేక రకాలుగా మారుతోంది. తాజాగా బీజేపీలో చేరడానికి సిద్దమవుతున్న చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకటరెడ్డి ఇంటివద్ద అర్థరాత్రి హై డ్రామా ఏర్పడింది. 

యాదాద్రి భువనగిరి : మునుగోడు రాజకీయం రోజురోజుకూ మరింత వేడెక్కుతోంది. ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.  కాగా యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన పలువురు టిఆర్ఎస్ కు చెందిన ప్రముఖ నేతలు కూడా బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. చౌటుప్పల్ టిఆర్ఎస్ ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి సహా పలువురు నేతలు బీజేపీ అధిష్టానంతో ఇప్పటికే టచ్లో ఉన్నారు. త్వరలో బిజెపిలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు వెంకటరెడ్డి తెలిపారు.  

తనతో సహా పలువురు స్థానిక నేతలు బీజేపీ లో చేరడానికి ముహూర్తం ఖరారు చేసుకోబోతున్నట్లు పేర్కొన్నారు. ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి బీజేపీ లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్న తరుణంలో హైదరాబాదులోని వనస్థలిపురంలో తాడూరి నివాసం వద్ద సోమవారం అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. తాడూరి వుండే నివాసానికి ఎస్ఓటీ, సిసిఎస్ పోలీసులు వచ్చి అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు.  భూ వివాదానికి సంబంధించిన  గతంలో నమోదైన కేసులను  మరోసారి తెరపైకి తెచ్చి  వారిని అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులతో తాడూరి వాగ్వాదానికి దిగారు. విచారణ నిమిత్తం అరెస్టు చేసేందుకు వచ్చామని అక్కడికి వచ్చిన పోలీసులు తెలిపారు.

Munugode ByPoll 2022 : రేవంత్ రెడ్డికి షాక్... టీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నేతలు

దీంతో అసలు ఎందుకు అరెస్టు చేసి విచారిస్తారు అని తాడూరి నిలదీశారు. అర్ధరాత్రి టాస్క్ఫోర్స్ పోలీసులు ఎంపీపీ వెంకట్రెడ్డి ఇంటిని చుట్టుముట్టిన విషయం తెలిసి… ఎంపీపీ ఇంటికి బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు సామ రంగారెడ్డి, బిజెపి నేతలు చేరుకున్నారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తాడూరి అరెస్టును అక్కడికి వచ్చిన బీజేపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. కాగా, తాడూరికి చౌటుప్పల్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. 

చౌటుప్పల్ పోలీసులు కాదు..
ఈ అంశానికి సంబంధించి తాడూరి స్పందించారు. ‘హైదరాబాద్ లో ఉంటున్న తన అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కి అర్ధరాత్రి చౌటుప్పల్ పోలీసులమని చెప్పి అరెస్టు చేసేందుకు కొందరు వచ్చారు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. చౌటుప్పల్ పోలీసులు కాదు. నేను అందర్నీ గుర్తు పడతాను. నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నేను టిఆర్ఎస్ పార్టీ ఎంపీపీని నాతో పాటు కొద్ది మంది జడ్పీటీసీలు, ఎంపీపీలు మరి కొంత మంది కార్యకర్తలు మేము అందరం కలిసి మాట్లాడుకునే బీజేపీలోకి పోదామని అనుకున్నాం.  ఈ సమయంలోనే మా ఇంటికి ఎవరో వచ్చి బెదిరింపులకు గురి చేస్తున్నారు’.. అని ఆయన అన్నారు. 

click me!