తమ్మినేని కృష్ణయ్య హత్య: ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ లో ఎనిమిది మందిపై కేసు

By narsimha lodeFirst Published Aug 16, 2022, 10:29 AM IST
Highlights

ఖమ్మం జిల్లాలోని తెల్దారుపల్లిలో టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. 

ఖమ్మం: జిల్లాలోని ఖమ్మం రూరల్ మండలంలోని తెల్దారుపల్లిలో  టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య పై ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సోమవారం నాడు పొన్నెకల్ వద్ద జాతీయ జెండా ఆవిష్కరించి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో తమ్మినేని కృష్ణయ్యను  దుండగులు హత్య చేశారు. 
ఈ ఘటనకు సంబంధించి తమ్మినేని వీరభద్రం సోదరుడు తమ్మినేని కోటేశ్వరరావు, ఎస్ కే రంజాన్, కృష్ణ కృష్ణస్వామి, లింగయ్య, శ్రీను, నాగేశ్వరరావు, నాగయ్యలపై  బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది.

తమ్మినేని కృష్ణయ్య కొడుకు నవీన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.  గతంలో తమ్మినేని కృష్ణయ్య సీపీఎంలో ఉన్నాడు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కుటుంబంతో తమ్మినేని కృష్ణయ్య విబేధించాడు. దీంతో మూడేళ్ల క్రితం తమ్మినేని కృష్ణయ్య సీపీఎంను వీడి టీఆర్ఎస్ లో చేరారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ప్రధాన అనుచరుడగా మారాడు.గ్రామంలో తమ ఆధిపత్యానికి తమ్మినేని కృష్ణయ్య చెక్ పెట్టాడని హత్య తమ్మినేని వీరభధ్రం  సోదరుడు కోటేశ్వరరావు ఈ హత్య చేయించారని బాధిత కుటుంబం ఆరోపిస్తుంది. 

పొన్నెకల్ నుండి జాతీయ జెండా ఆవిష్కరించి తిరిగి వస్తున్న క్రమంలో  తమ రాకపోకలను గమనించిన కొందరు ఫోన్లలో నిందితులకు సమాచారం ఇచ్చారని ప్రత్యక్ష సాక్షి ముత్తేశం చెప్పారు. హత్యకు గురైన సమంలో తమ్మినేని కృష్ణయ్య బైక్ పై వెళ్తున్నాడు. ఈ సమయంలో బైక్ ను ముత్తేశం నడుపుతున్నాడు. తాము పొన్నెకల్ నుండి వస్తున్న సమయంలో కొందరు తమ సమాచారం గురించి ఫోన్లలో మాట్లాడుకోవడాన్ని గమనించిన తాను కృష్ణయ్యతో చెప్పానన్నారు. అయితే కృష్ణయ్య ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదన్నారు. ఆటోలో వేగంగా వచ్చిన నిందితులు తమ బైక్ ను ఢీకొట్టడంతో  బైక్ తో సహా కింద పడినట్టుగా ముత్తేశం చెప్పారు. రోడ్డుకు అవతలివైపున ఉన్న కాలువలో తమ్మినేని కృష్ణయ్య పడ్డాడని చెప్పారు. అప్పటికే తమ వద్ద ఉన్న కత్తులతో తమ్మినేని కృష్ణయ్యపై దుండగులు దాడికి పాల్పడ్డారన్నారు.  తన వైపునకు కూడా ఇద్దరు వచ్చే సమయంలో తాను రాళ్లతో వారిపై దాడికి దిగినట్టుగా చెప్పారు.దీంతో నిందితులు ఆటోను తీసుకొని పారిపోయారని ముత్తేశం మీడియాకు చెప్పారు.  మూడేళ్లుగా తాను తమ్మినేని కృష్ణయ్యతోనే ఉన్నానని ఆయన చెప్పారు,.

also read:వీరభద్రం కుటుంబం ఆదిపత్యానికి చెక్ పెట్టాడనే హత్య: తమ్మినేని కృష్ణయ్య భార్య

తమ్మి,నేని కృష్ణయ్య హత్య నేపథ్యంలో తెల్దారుపల్లిలో హై టెన్షన్ నెలకొంది. తమ్మినేని వీరభద్రం సోదరుడు తమ్మినేని కోటేశ్వరరావు ఇంటిని  తమ్మినేని కృష్ణయ్య అనుచరులు ధ్వంసం చేశారు. తమ్మినేని కోటేశ్వరరావు  గ్రానైట్ ఫ్యాక్టరీపై కూడా దాడికి దిగారు. దీంతో తొలుత తెల్దారుపల్లిలో 144 సెక్షన్ విధించారు. ఆ తర్వాత ఖమ్మం రూరల్ మండలం మొత్తం 144 సెక్షన్ ను విధిస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు.తమ్మినేని కృష్ణయ్య మృతదేహానికి నిన్ననే పోస్టుమార్టం పూర్తి చేశారు. పోస్టుమార్టం పూర్తి చేసిన తర్వాత మృతదేహన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.  ఇవాళ తమ్మినేని కృష్ణయ్య అంత్య క్రియలను  నిర్వహించనునన్నారు. బాధిత కుటుంబాన్ని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు. 

click me!