జగన్ చెప్పారు, ఏపిలో పెరిగే జిల్లాల సంఖ్య ఇదే: కేసీఆర్

By Arun Kumar PFirst Published Mar 7, 2020, 4:55 PM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ మరో తెలుగురాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ వ్యవహారాలపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. 

హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. శుక్రవారం గవర్నర్ ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభమవగా శనివారం ఆ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ సందర్భంగా అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగంలో పలుమార్లు పక్కరాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తావన కూడా వచ్చింది. 

తెలంగాణ ఏర్పడిన తర్వాత పాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటుచేసినట్లు కేసీఆర్ వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీలోని కొందరు నాయకులు స్వాగతించగా మరికొందరు వ్యతిరేకించారు. ఇలా ఆ పార్టీ నాయకుల మధ్యే ఏకాభిప్రాయం లేదని... వీళ్లు తమ నిర్ణయాలను తప్పుబట్టడం, ప్రశ్నించడం విడ్డూరంగా వుందన్నారు. 

read more  చార్జీలు పెంపు: తెలంగాణ ప్రజలకు కేసీఆర్ కరెంట్ షాక్

33 జిల్లాలతో ప్రస్తుతం తెలంగాణ ప్రజలకు సుపరిపాలన అందుతోందని కేసీఆర్ అన్నారు. కేవలం పశ్చిమ బెంగాల్, ఆంధ్ర ప్రదేశ్ తప్ప దేశంలోని అన్ని రాష్ట్రాలు జిల్లాల సంఖ్యను పెంచుకున్నాయని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ లోనూ అతి త్వరలో జిల్లాల సంఖ్య పెరగనుందని కేసీఆర్ తెలిపారు. 

వివిధ విషయాలపై ఏపి సీఎం జగన్, తాను చాలాసార్లు మాట్లాడుకున్నామని... దీన్ని బట్టి జిల్లాలను పెంచుకోవాలన్న  ఆలోచనలో ఆయన వున్నట్లు తెలిసిందన్నారు. తనకున్న సమాచారం ప్రకారం ఏపిలో 25 జిల్లాలు ఏర్పాటయ్యే అవకాశం వుందన్నారు. తెలంగాణను చూశాకే ఏపీ ప్రభుత్వానికి జిల్లాలను పెంచుకోవాలన్న ఆలోచన వచ్చిందని కేసీఆర్ పేర్కొన్నారు.

read more   తెలంగాణలో కరోనా రాదు: కారణం చెప్పిన కేసీఆర్
 

click me!