దళిత సాధికారత పేరిట మోసం... సీఎం కేసీఆర్ పెద్ద మోసగాడు: మందకృష్ణ మాదిగ

Arun Kumar P   | Asianet News
Published : Jul 01, 2021, 09:38 AM ISTUpdated : Jul 01, 2021, 10:04 AM IST
దళిత సాధికారత పేరిట మోసం... సీఎం కేసీఆర్ పెద్ద మోసగాడు: మందకృష్ణ మాదిగ

సారాంశం

దళిత సాధికారత పేరిట పేరిట మరోసారి దళిత సమాజాన్ని మోసం చేయడానికి సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని మందకృష్ణ మాదిగ ఆరోపించారు.   

హైదరాబాద్‌:  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ విమర్శలు గుప్పించారు. దళిత సాధికారత పేరిట మరోసారి దళిత సమాజాన్ని మోసం చేయడానికి సీఎం ప్రయత్నిస్తున్నారని అన్నారు. కేసీఆర్ పెద్ద మోసగాడని మందకృష్ణ మండిపడ్డారు. 

కేసీఆర్ కు దళిత సాధికారత పట్ల చిత్తశుద్ది లేదని ఏడేళ్ల పాలనలోనే తేలిపోయిందని పేర్కొన్నారు. దళితులను మభ్య పెట్టడం ఆయనకు అలవాటుగా మారిందని... తాజాగా మరోసారి మోసం చేయడానికి సిద్దమయ్యారన్నారు. కేసీఆర్ పాలనలో దొరల తెలంగాణ వస్తుందని గతంలో అన్న మాటలను  మందకృష్ణ గుర్తుచేశారు. 

read more  దళితుడికి న్యాయం చేయలేదు: కేసీఆర్ పై ఈటల ఫైర్

కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతిపక్షాలు పోరాటం చేయడం లేదని... ఇక వామపక్షాలయితే టీఆర్ఎస్ కు మిత్రపక్షంగా మారిపోయాయని అన్నారు. రాష్ట్రంలోని మేధావి వర్గం కేసీఆర్ గడీలో పదవులు అనుభవిస్తూ ప్రశ్పించడాన్ని మరిచి బంధీలుగా మిగిలిపోయారని మందకృష్ణ అన్నారు. 

మరియమ్మ లాకప్ డెత్ పై మందకృష్ణ స్పందిస్తూ... దళిత మహిళ మరణానికి కారణమైన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎందుకు నమోదు చేయలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆమెది లాకప్ డెత్ అని నిర్దారణ అయిన తర్వాత కూడా పోలీసులపై చర్యలకు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని మందకృష్ణ మాదిగ కేసీఆర్ సర్కార్ ను నిలదీశారు. 

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్