సోషల్ మీడియాలో తనమీద వస్తున్న వార్తల మీద మాజీమంత్రి, బీజేపీ నాయకుడు ఈటెల రాజేందర్ స్పందించారు. ఇటీవల తనమీద అభియోగాలు వచ్చిన సమయంలో సీఎం కేసీఆర్ కు ఈటెల రాసినట్టుగా ఉన్న లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.
సోషల్ మీడియాలో తనమీద వస్తున్న వార్తల మీద మాజీమంత్రి, బీజేపీ నాయకుడు ఈటెల రాజేందర్ స్పందించారు. ఇటీవల తనమీద అభియోగాలు వచ్చిన సమయంలో సీఎం కేసీఆర్ కు ఈటెల రాసినట్టుగా ఉన్న లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.
దీంతో ఆయన మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. అయితే అవన్నీ ఫేక్ వార్తలేనని, వాటిని ఆయన ఖండించారు. టీఆర్ఎస్ ఐటీ విభాగం చిల్లర పనులు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో తనను ఎదుర్కొనే దమ్ము లేక తనమీద ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఈటెల ప్రకటన విడుదల చేశారు.
undefined
కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులపై మాజీ మంత్రి బిజెపి నాయకులు ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసిఆర్ కుట్ర దారుడు, మోసకాడు... ఆయనకు కుట్రలు, కుతంత్రాలు తప్ప ప్రజలమీద ప్రేమ లేదని ఈటల మండిపడ్డారు.
జమ్మికుంటలో ఏర్పాటుచేసిన బీజేపీ నూతన కార్యాలయాన్ని ఈటల సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ ప్రభుత్వం కొనసాగడం అరిష్టం అని ప్రజలు అంటున్నారన్నారు. వైద్యానికి బడ్జెట్ పెంచమని తాను మంత్రిగా ఉన్నప్పుడే అడిగానని... అలా చేస్తే ఎక్కడ తనకు క్రెడిబిలిటీ వస్తుందో అని బయటికి వచ్చిన తరువాత ఇప్పుడు ప్రకటిస్తున్నారని అన్నారు.
''హుజూరాబాద్ ఎన్నిక ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపింది. ఈ ఎన్నిక ఏకంగా సీఎం కేసీఆర్ నే ఫాంహౌస్ నుండి బయటకు పరుగులు తీయించింది. ప్రజల బాగోగులు పట్టించుకోకపోతే పుట్టగతులు ఉండవని భయాన్ని లేపింది'' అన్నారు.
''తెలంగాణలో 85% బడుగు బలహీనర్గ ప్రజలే వున్నారు. వారిని సీఎం గత ఏడు సంవత్సరాలు మర్చిపోయారు. దళిత సీఎం దేవుడెరుగు ఉపముఖ్యమంత్రిని కూడా అర్దాంతరంగా తీసివేసి దళితులను అవమానపరిచాడు. 16 శాతం ఉన్నవారికి ఎన్ని మంత్రి పదవులు ఉన్నాయి 0.5 శాతం ఉన్నవారికి ఎన్ని పదవులు ఉన్నాయి. మాదిగ లు ఒక మంత్రి, మాలలు ఒక మంత్రి అర్హులు కాదా? సీఎం కార్యాలయంలో ఎంత మంది బడుగు బలహీన వర్గాల వారు ఐఏఎస్ లు ఉన్నారు. ఈ జాతులు పనికిరావా? ఈ జాతులకు ఆ నైపుణ్యం లేదు అని అవమానించిన వ్యక్తి కెసిఆర్. ఉద్యోగులు అందరూ సంఘాలు పెట్టుకుంటే అణచి వేసిన వ్యక్తి'' అని మండిపడ్డారు.