KCR: అవసరమనుకుంటే భారత రైతాంగ సమస్యలపై టీఆర్‌ఎస్ లీడర్ షిప్ తీసుకుంటుంది.. కేంద్రంపై కేసీఆర్ ఫైర్

By team teluguFirst Published Nov 18, 2021, 2:09 PM IST
Highlights

ముఖ్యమంత్రి, మంత్రి పదవులకు భయపడే ప్రసక్తే లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. అవసరం అనుకుంటే భారత రైతాంగ సమస్యల కోసం టీఆర్‌ఎస్ పార్టీ (TRS Party) లీడర్ షిప్‌ తీసుకుంటుందని అన్నారు.

ముఖ్యమంత్రి, మంత్రి పదవులకు భయపడే ప్రసక్తే లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అవసరం అనుకుంటే భారత రైతాంగ సమస్యల కోసం టీఆర్‌ఎస్ పార్టీ లీడర్ షిప్‌ తీసుకుంటుందని అన్నారు. వరి కొనుగోళ్లపై కేంద్రం ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ ఇందిరా పార్క్ (Indira park)  టీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన మహాధర్నాలో (TRS Maha Darna) సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతుల గోస తెలంగాణలో కాదు.. దేశవ్యాప్తంగా రైతుల అందరికి ఉన్నారు. ఈ సభలో కూడా కేంద్రం సీఐడీలు ఉన్నారని.. తాను మాట్లాడే మాటలు పావు గంటలోనే మోదీ టేబుల్ చేరుతుందని అన్నారు. దేశంలో అద్భుతమైన శాస్త్రవేత్తలు ఉన్నారని అన్నారు. బంగారం పండే భూములను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. రైతులను బతకనిస్తారా..? బతకనివ్వరా.. అని ప్రశ్నించారు.

ఏడాది కాలం నుంచి ఉత్తర భారతంలో రైతులు దీక్షలు చేస్తున్నారని గుర్తుచేశారు. కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలను రద్దు చేయాలని వారు కోరుతున్నాని అన్నారు. కానీ కేంద్రం నిజాలు చెప్పలేక.. అడ్డగోలు మాటలు మాట్లాడుతుందని మండిపడ్డారు.  ఈ దేశాన్ని నడపడంలో ఇప్పటివరకు పాలించిన అన్ని పార్టీలు విఫలమయ్యాయని అన్నారు. భారత్ ఆకలి రాజ్యమని నివేదికలు సూచిస్తున్నాయి. గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో 116 దేశాల్లో సర్వే చేస్తే భారత్ దేశం 101 స్థానంలో ఉంది. బంగ్లాదేశ్, పాకిస్తాన్ కన్నా భారత్ దీన స్థితిలో ఉంది.  కేంద్రం అనేక సమస్యలను పెండింగ్‌లో పెట్టిందని అన్నారు. కుల గణన చేయాలని తీర్మానం చేస్తే దానికి ఇంతవరకు దిక్కు లేదని అన్నారు. సమస్యలు పక్కకు పెట్టి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. కేంద్రం నీళ్లివ్వకుండా రాష్ట్రాల మధ్య తగాదాలు పెడుతుందని విమర్శించారు. 


‘మేం తెచ్చిన సాగు విధానాలతో రాష్ట్ర రైతాంగం ఒక దరికి వచ్చింది. దిక్కుమాలిన కేంద్రం బుర్రలు పనిచేయడం లేదన్నారు. ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం చెప్పింది. కేంద్రం తీరుతో వరి సాగు వద్దని చెప్పాం. ఇష్టం లేకున్నా వరి వేయద్దని అన్నాం. వరికి ప్రత్యామ్నాయ పంటలు వేయాలని కోరాం’అని సీఎం కేసీఆర్ అన్నారు.

ఇన్నాళ్లు చాలా ఓపికగా ఉన్నామని.. కానీ ఓపికకు కూడా ఓ హద్దు ఉంటుందని అన్నారు. బీజేపీ సర్జికల్ స్ట్రైక్స్ నాటకాలు, సరిహద్దుల్లో ఆడే నాటకాలు, చేసే మోసాలు బట్టబయలు అయ్యాయని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి చరమ గీతం పాడితినే దేశానికి విముక్తి అని అన్నారు. మరో పోరాటం చేయకపోతే.. దేశానికి విముక్తి లభించదని అన్నారు. రెండు, మూడు రోజులు వేచి చూసి.. ఆ తర్వాత ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

‘తెలంగాణలో ఒక్క నిమిషం కూడా పోని నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాం. కమిట్‌మెంట్ ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. దేశంలో నాలుగు లక్షల మెగావాట్ల కరెంట్ అందుబాటులో ఉంది. దేశం రెండు లక్షల మెగావాట్లకు మించి కరెంట్ వాడటం లేదు. తెలంగాణలో మినహా ఎక్కడ 24 గంటల కరెంట్ ఇవ్వరు. అందుబాటులో కరెంట్ ఉన్న పరిశ్రమలకు, రైతులకు ఇవ్వరు. మీటర్లు పెట్టి రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 

తెలంగాణలో మీటర్లు లొల్లి లేదు. నీటి సరఫరా బ్రహ్మాండగా ఉంది. రైతు బంధు, రైతు భీమా ఇచ్చే ఏకైక రాష్ట్రం  తెలంగాణ. మాకు ఇంత విస్తీర్ణంలో పంటలు ఉన్నాయంటే.. కేంద్రం నమ్మకుండా అనుమానిస్తుంది. వడ్లు పండనప్పుడు.. బీజేపీ నేతుల కల్లాలు కాడని ఎందుకు పోతున్నారు. ఈ అసమర్ద పాలనకు విముక్తి పలకాలి. మరో పోరాటనికి మనం సిద్దం కావాల్సిందే. 

సమస్యలకు పరిష్కారం మన దగ్గరే దొరకదు. బతిమాలితే దొరకతే.. చిచ్చమెత్తుకుంటే దొరకదు. ఈ దేశ ప్రజలు బిచ్చగాళ్లు.. మనం కూడా బిచ్చగాళ్లు కాదు. దేశానికి అన్నం పెడతామని రైతులు చెబితే.. ఇంతా గోల్‌మాల్ చేస్తారా..? మాట్లాడితే కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. కేసీఆర్ భయపడితే తెలంగాణ వచ్చేదా..?.. చిత్తశుద్ది ఉంటే వర్షకాలంలో వచ్చే పంటను కొంటారా.. లేదా.. డైరెక్ట్‌గా చెప్పండి. యాసంగిలో వరి వేయమంటారా..? లేక తప్పు చేశామని ముక్కు నేలకు రాస్తారా..?’అని కేసీఆర్ ప్రశ్నించారు.  వరి వేసి అమ్ముడుపోకపోతే రైతుల పరిస్థితి ఏమిటి..? రైతుల బతుకులతో రాజకీయం చేస్తుంటే ప్రశ్నించే అవసరం లేదా.. అని కేసీఆర్ అడిగారు.

click me!