నిరుద్యోగులను చంపుతున్న హంతకుడు.. కేసీఆర్ పై షర్మిల విమర్శలు..!

By telugu news teamFirst Published Nov 18, 2021, 1:51 PM IST
Highlights

ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకపోవడంతోనే యువకుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఫైర్ అవుతున్నాయి.తాజాగా ఇదే అంశంపై వైఎస్సార్‌టీపీ చీఫ్ షర్మిల ట్విట్టర్ వేదికగా స్పందించారు.

నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను చంపుతున్న హంతకుడు సీఎం కేసీఆర్ అని ట్విట్టర్ వేదికగా వైఎస్‌ఆర్‌ టీపీ షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఉద్యోగాల కోసం ఎదురు చూసి చూసి నోటిఫికేషన్లు రాకపోవడంతో కొందరు ఆత్మబలిదానాలకు సిద్ధపడుతున్నారు. 

తాజాగా మరో ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈక్రమంలోనే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. పదుల సంఖ్యలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని మండిపడుతున్నాయి. ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకపోవడంతోనే యువకుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఫైర్ అవుతున్నాయి.తాజాగా ఇదే అంశంపై వైఎస్సార్‌టీపీ చీఫ్ షర్మిల ట్విట్టర్ వేదికగా స్పందించారు.

Also Read: TRS Maha Darna: ప్లకార్డులు చేతబట్టిన మంత్రులు... ఇందిరాపార్క్ వద్ద టీఆర్ఎస్ నిరసన

నోటిఫికేషన్లు ఇవ్వకుండా
నిరుద్యోగులను చావు బాట పట్టిస్తూ, బడి బువ్వ బంద్ పెట్టి పేద బిడ్డలకు చదువును దూరంచేస్తూ నేటి తెలంగాణాను, రేపటి భవిష్యత్తును భ్రష్టు పట్టిస్తున్నారు దొరగారు. 1/2 pic.twitter.com/trCnhPuaak

— YS Sharmila (@realyssharmila)

‘ఉద్యమ కారుడు అని చెప్పుకోవడానికి సిగ్గు పడండని సూచించారు. ఇంకా ఎంత మంది బలి తీసుకుంటే నోటిఫికేషన్లు ఇస్తావు దొర అని ఆమె ప్రశ్నించారు. మరొక నిరుద్యోగి ప్రాణం పోకముందే నోటిఫికేషన్లు ఇవ్వండన్నారు. లేదా సీఎం పోస్ట్‌కి రాజీనామా చేయండని సూచించారు.’

 

‘మీకు కనికరం లేదు, కనీసం చీమ పారినట్టు కూడా లేదు. ఎందుకంటే, చచ్చేది మీ బిడ్డలు కాదు కాబట్టి..’ అంటూ కేసీఆర్‌పై షర్మిల ఫైర్ అయ్యారు. సీట్లు, ఓట్ల మీదున్న ఆరాటం యువత ప్రాణాల మీద లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నిన్న మహేష్, ఈ రోజు లవణ్ కుమార్, శ్రీకృష్ణ.. ఈ ఏడాది దాదాపు 20 మందికి పైగా నిరుద్యోగులను చంపిన హంతకుడు మీరు..’ అని సీఎంపై తీవ్ర ఆరోపణలు చేశారు. మరొక నిరుద్యోగి ప్రాణం పోకముందే నోటిఫికేషన్లు వేయాలని.. లేదంటే రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.
 

click me!