తెలంగాణా రావానులకుంటున్న నోకియా

First Published May 24, 2017, 4:05 PM IST
Highlights

తెలంగాణా ఫైబర్ గ్రిడ్ ప్రాజక్టులో భాగస్వామి అయ్యేందుకు నోకియా ఆసక్తి  కనబర్చింది.ఫైబర్‌ గ్రిడ్‌ కోసం జారీ చేయబోయే ఆర్‌ఎఫ్‌పీలో పాల్గొంటామని కంపెనీ  ప్రతినిధులు తెలిపారు.  తెలంగాణాలోకి పెట్టుబడులు ఆహ్వానించేందుకు ఐటి మంత్రి కెటిఆర్ అమెరికాలో ఏర్పాటుచేసిన ఒక సమావేశంలో నోకియా ఈ విషయం వెల్లడించింది.

తెలంగాణా ఫైబర్ గ్రిడ్ ప్రాజక్టులో భాగస్వామి అయ్యేందుకు నోకియా ఆసక్తికనబర్చింది.ఫైబర్‌ గ్రిడ్‌ కోసం జారీ చేయబోయే ఆర్‌ఎఫ్‌పీలో పాల్గొంటామని కంపెనీ  ప్రతినిధులు తెలిపారు.   

 తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌ అమెరికాలో వివిధ పారిశ్రామిక వర్గాలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.

రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన పర్యటన కొనసాగుతోంది.

ఇందులో భాగంగా ఈ రోజు ఆయన నోకియా, ఎరిక్సన్‌ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు.

తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టులో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. కేటీఆర్‌ విజ్ఞప్తికి స్పందిస్తూ నోకియా ఫైబర్‌ గ్రిడ్‌పై ఆసక్తి కనబర్చింది.

డేటా అనలిటిక్స్‌ పార్కులో మొబైల్‌ ప్లాంట్‌ ఏర్పాటుచేయాలని కేటీఆర్‌ కోరారు. అంతకుముందు,

కాలిఫోర్నియాలో యూఎస్‌ ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానం, టీఎస్‌ ఐపాస్‌ విశిష్టతలు, ఇప్పటివరకు రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల వివరాలను ఆయన వివరించారు.

తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు , ప్రాధాన్యతలను అక్కడి పారిశ్రామికవేత్తలకు కేటీఆర్‌ వివరించారు.

సేల్స్‌ ఫోర్స్‌ కంపెనీ ప్రతినిధులతోనూ సమావేశమైన మంత్రి రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు.

సేల్స్‌ ఫోర్స్‌ స్పీకర్‌ సీరిస్‌లో కంపెనీ పబ్లిక్‌ పాలసీ హెడ్‌తో సమావేశమైన ఆయన మేక్‌ ఇన్‌ ఇండియా సహా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు.

click me!