
హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా రేపు తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఆయన పర్యటన ఖరారైంది. ఖమ్మంలో బీజేపీ తలపెట్టిన సభలో అమిత్ షా ప్రసంగించనున్నారు. ఆయన షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి.
కేంద్ర మంత్రి అమిత్ షా 27వ తేదీన మధ్యాహ్నం ఢిల్లీ నుంచి బయల్దేరుతారు. మధ్యాహ్నం 1.25 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో కొత్తగూడేనికి మధ్యాహ్నం 2.10 గంటలకు చేరుకుంటారు. అనంతరం, భద్రాచలానికి రోడ్డు మార్గానా వెళ్లుతారు.
భద్రాచలంలో సీతారాముల ఆలయంలో మధ్యాహ్నం 2.25 గంటల నుంచి 2.40 గంటల వరకు పూజలో ఉంటారు. మళ్లీ అక్కడి నుంచి రోడ్డు మార్గాన కొత్తగూడెం వెళ్లుతుారు. కొత్తగూడెం నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి ఖమ్మంకు మధ్యాహ్నం 3.30 గంటల వరకు చేరుకుంటారు.
ఖమ్మంలో బీజేపీ రైతు ఘోష బీజేపీ భరోసా బహిరంగ సభ నిర్వహిస్తున్నది. ఈ సభలో అమిత్ షా మధ్యాహ్నం 3.45 గంటల నుంచి 4.35 గంటల వరకు పాల్గొంటారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే తాము తీసుకువచ్చే విధానాలు, సంక్షేమ నిర్ణయాల వంటి వాటిపై ఆయన ఈ సభలో మాట్లాడతారు.
Also Read: Warangal: ఫుల్ బాటిల్ ఇస్తవా? లేదా?.. బార్‌లోకి తల్వార్ తీసుకెళ్లిన మందుబాబు.. పోలీసులకూ సవాల్
ఈ సభ తర్వాత పార్టీకి సంబంధించిన సమావేశాల్లో అమిత్ షా పాల్గొంటారు. ఎన్నికల వ్యూహంపై రాష్ట్ర నేతలకు దిశా నిర్దేశం ఇవ్వనున్నారు.అలాగే, బస్సు యాత్రల తేదీలను కన్ఫామ్ చేస్తారు. ఈ సమావేశాలు ముగిసిన తర్వాత కేంద్ర మంత్రి అమిత్ షా తిరిగి సాయంత్రం 5.45 గంటలకు హెలిక్టాపర్‌లో గన్నవరానికి వెళ్లిపోతారు. అక్కడి నుంచి సాయంత్రం 6.25 గంటలకు ఢిల్లీకి వెళ్లుతారు.
అమిత్ షా తెలంగాణ పర్యటన పలుమార్లు వాయిదా పడింది. ఈ సారి ఎలాగైనా అమిత్ షా తెలంగాణలో పర్యటన విజయవంతంగా చేసుకోవాలని భావిస్తున్నారు. బీజపీ రాష్ట్ర నాయకులు కూడా అమిత్ షా పర్యటన కోసం ఎదురుచూస్తున్నారు. ఖమ్మం సభకు సంబంధించి ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి.