రైతు బంధు పథకం అసలు ఉద్దేశం ఇది : హరీష్ రావు

Published : May 28, 2018, 02:51 PM IST
రైతు బంధు పథకం అసలు ఉద్దేశం ఇది : హరీష్ రావు

సారాంశం

వికారాబాద్ పర్యటనలో మంత్రి హరీష్ బిజి బిజి

రైతు బంధు పథకాన్ని తెలంగాణ సిఎం కేసిఆర్ ఎందుకు తీసుకొచ్చారో వివరణ ఇచ్చారు తెలంగాణ మంత్రి హరీష్ రావు. వికారాబాద్ జిల్లాలోని చించల్ పేట బహిరంగ సభలో మంత్రి హరీష్ రావు మాట్లాడారు. ఆయన కామెంట్స్.

రైతులు బ్యాంకుల వద్ద, అప్పుల వాళ్ల వద్ద నుంచి వడ్డీకి అప్పులు తెచ్చుకోవద్దనే రైతుబంధు పథకాన్ని‌సీఎం తెచ్చారు. వచ్చే ఆగష్టు 15 వ తేదీ నుంచి పాస్ బుక్ ఉన్న ప్రతీ రైతుకు బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. ఏ కారణంతో రైతు చనిపోయినా  ఐదు లక్షల రూపాయలు వారి కుటుంబ సభ్యలకప అందజేస్తాం. ముఖ్య మంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి. రైతులకు సాగు నీరు, ఉచిత విద్యుత్, రైతు బంధు పథకం ద్వారా నాలుగు వేల పెట్టుబడి తాజాగా  రైతులకు ఐదు‌లక్షల ఉచిత బీమా. ఇలా దేశంలోని ఏ సీఎం చేయని రీతిలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు.

రైతులు బ్యాంకుల వద్ద, అప్పుల వాళ్ల వద్ద నుంచి వడ్డీకి అప్పులు తెచ్చుకోవద్దనే రైతుబంధు పథకాన్ని‌సీఎం తెచ్చారు. పట్టా, ప్రభుత్వ, అటవీ భూములలో సాగు చేసే వారందరికీ నాలుగు వేల రూపాయలు అందిస్తాం. రైతులకు అనుమానాలు ‌వద్దు. ప్రతీ పంటకు, ప్రతీ ఏడాది నాలుగు వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తాం. పార్టీ, కులం, మతం అనే తారతమ్యాలు లేకుండా కల్యాణ లక్ష్మి పథకం ద్వారా లక్ష రూపాయలు ఆడపిల్లల పెళ్లికి ప్రభుత్వం సాయం చేస్తోంది. గర్భిణీ స్త్రీ కి కేసీఆర్ కిట్ తే పాటు 12 _వేల రూపాయల సాయాన్ని అందిస్తున్నాం. పేదలకు ఉచిత కార్పోరేట్ వైద్యాన్ని ప్రభుత్వం అందిస్తోంది. పేదల దవఖానాను మార్చి ఆధునిక డయాలసిస్ కేంద్రాలు, ఐసీయూ సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోంది.

రెండు వందల రూపాయల పెన్షన్ ను వేయికి ఏ ప్రభుత్వం పెంచలేదు. ఆ ఘనత కేసీఆర్ కే దక్కింది. వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు వేయి రూపాయల పెన్షన్ అందించి వారికి సీఎం భరోసా కల్పించారు. చించల్ పేటలోను 643 మంది రైతులకు 80 లక్షల రూపాయలు రైతుబందు పథకం ద్వారా అందించాం. యాసంగి పంటకు మరో 80 లక్షలు అందజేస్తాం. ప్రభుత్వం ఈ జిల్లాలో కందులు, వడ్లు, శనగలు, , మక్కలు ప్రతి గింజా కొన్నాం. చించల్ పేటకు ఆర్టీసీ బస్ వేస్తాం. ఎస్.బి.ఐ బ్యాంకు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరారు. ఏర్పాటు చేసే బాధ్యత వికారాబాద్ జిల్లా కలెక్టర్ కు అప్పగిస్తున్నాం.

PREV
click me!

Recommended Stories

Telangana RTC Strike Begins! ఆర్టీసీ బంద్..తెలంగాణలో ఏం జరుగుతోంది? | TSRTC | Asianet News Telugu
Minister Ponnam Prabhakar: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మంత్రి పొన్నం రియాక్షన్‌ | Asianet News Telugu