కాంగ్రెస్ గెలిస్తే సీఎం ఎవరు? భట్టి విక్రమార్క సమాధానం ఇదే

కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సాధించి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. అయితే, సీఎం ఎవరనేది మాత్రం పార్టీనే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
 

cm candidate would be chosen by party says congress mla bhatti vikramarka kms

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా పోటీ ఉన్నది. కొన్ని సర్వేల్లో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ముందంజలో ఉన్నదని కూడా చెబుతున్నాయి. కాంగ్రెస్ కూడా ప్రతి అడుగును ఆచితూచీ వేస్తున్నది. ఈ సారి ఎన్నికల్లో తామే గెలువబోతున్నామనే విశ్వాసం కాంగ్రెస్ నేతలకు వచ్చేసింది. కాంగ్రెస్‌లోని అనేక అంతర్గత సమస్యల్లో ‘సీఎం అభ్యర్థి’ కూడా ఒకటి. రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య సీఎం క్యాండిడేట్ విషయమై ఇప్పటికే రుసరుసలు ఉన్నాయి.

జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క సహా పలువురు నేతలు సీఎం కుర్చీ కోసం ఎదురుచూస్తున్నవారే. తాజాగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా తన మనసులోని మాట బయటపెట్టారు. ఈ సందర్భంలో మధిర ఎమ్మెల్యే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సీఎం సీటుపై కామెంట్ చేశారు.

Latest Videos

Also Read: సై అంటే సై.. రాజస్తాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భార్య, భర్తల మధ్యే పోటీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి కాంగ్రెస్ భారీ మెజార్టీ సాధిస్తుందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని భట్టి అన్నారు. అయితే, సీఎం ఎవరనేది మాత్రం పార్టీనే నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. సీఎల్పీ భేటీలో ముఖ్యమంత్రి ఎంపిక జరుగుతుందని వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 74 నుంచి 78 సీట్లను గెలుచుకుంటుందని భట్టి విక్రమార్క అంచనా వేశారు.

తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్ త్వరలోనే రెండో జాబితాను విడుదల చేస్తామని భట్టి తెలిపారు. బీఆర్ఎస్ నేతలకు ఓడిపోతామనే విషయం అర్థమైపోయిందని ఎద్దేవా చేశారు.

vuukle one pixel image
click me!