టీఎస్ఆర్టీసీకి కాసులు కురిపించిన దసరా .. ఒక్కో రీజియన్‌కు రూ. 2 కోట్ల వరకు లాభం

By Siva Kodati  |  First Published Oct 24, 2023, 9:17 PM IST

దసరా పండుగ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)కి కాసుల వర్షం కురిపించింది . ఈ పది రోజుల్లో సంస్థకు రూ.25 కోట్ల ఆదాయం వచ్చినట్లుగా అధికారులు భావిస్తున్నారు. పది రీజియన్లకు గాను ఒక్కో దానికి రూ.2 కోట్ల నుంచి రూ.2.50 కోట్ల వరకు అదనపు ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.  


దసరా పండుగ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)కి కాసుల వర్షం కురిపించింది. బతుకమ్మ, దసరా పండుగలను కుటుంబంతో కలిసి జరుపుకునేందుకు నగరవాసి పల్లెలకు బయల్దేరారు. ఈ సందర్భంగా ప్రజల సౌకర్యార్ధం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. తద్వారా ఈ పది రోజుల్లో సంస్థకు రూ.25 కోట్ల ఆదాయం వచ్చినట్లుగా అధికారులు భావిస్తున్నారు. తెలంగాణలోని జిల్లాలతో పాటు ఏపీ, కర్ణాటక తదితర రాష్ట్రాలకు కలిపి 5,500 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ బస్సులను నడిపింది. వీటికి అదనంగా 1302 ప్రత్యేక బస్సులను సైతం ఏర్పాటు చేసింది.  హైదరాబాద్‌లోని ప్రధాన కూడళ్లలో బస్సులను అందుబాటులో వుంచింది. అంతేకాదు.. ప్రత్యేక బస్సులనూ సాధారణ ఛార్జీలనే వసూలు చేసింది.  

డైనమిక్ ఛార్జీల విధానం కూడా సత్ఫలితాలను ఇచ్చింది. ప్రయాణీకుల రద్దీ తక్కువ వున్న సమయంలో తక్కువ ఛార్జీలు, ఎక్కువగా వున్న సమయంలో ఎక్కువ ఛార్జీలను వసూలు చేయడమే డైనమిక్ ఫేర్ ఉద్దేశం . ప్రైవేట్ ట్రావెల్స్‌తో పోల్చితే డైనమిక్ ఛార్జీలు తక్కువగా వుండటంతో ప్రజలు ఆర్టీసీనే ఆశ్రయించారు. అక్టోబర్ 13 నుంచి 24 వరకు మొత్తంగా 11 రోజుల పాటు ప్రత్యేక బస్సులను నడిపింది ఆర్టీసీ. తద్వారా ఆర్టీసీకి రోజుకు రూ.12 కోట్ల నుంచి 13 కోట్ల వరకు ఆదాయం సమకూరినట్లుగా తెలుస్తోంది. అలాగే అదనంగా రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు వచ్చినట్లుగా సమాచారం. పది రీజియన్లకు గాను ఒక్కో దానికి రూ.2 కోట్ల నుంచి రూ.2.50 కోట్ల వరకు అదనపు ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. 

Latest Videos

click me!