సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదం జరిగిన భవనాలను క్లూస్ టీమ్ అధికారులు పరిశీలించారు.
హైదరాబాద్: సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదం ఘటనపై క్లూస్ టీమ్ ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ కాంప్లెక్స్ లో ప్రతి అంతస్థులో అన్ని భవనాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో గురువారంనాడు రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది.ఈ అగ్ని ప్రమాదం కారణంగా ఆరుగురు మృతి చెందారు. మృతదేహలను గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. శుక్రవారం నాడు ఉదయం స్వప్నలోక్ కాంప్లెక్స్ లో క్లూస్ టీట్ పరిశీలిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను క్లూస్ టీమ్ అన్వేషిస్తుంది. స్వప్నలోక్ కాంప్లెక్స్ లోని ఐదు, ఆరు, ఏడు అంతస్థుల్లో స్వల్పంగా పొగ వెలువడుతుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్టుగా అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
స్వప్నలోక్ కాంప్లెక్స్ లో ఫైర్ ఫైటింగ్ సిస్టం సరిగా లేదని భవన యజమానులను హెచ్చరించినట్టుగా అగ్ని మాపక సిబ్బంది చెబుతున్నారు. ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ ను అప్ డేట్ చేయాలని అగ్నిమాపక సిబ్బంది సూచించారు.కానీ ఇంకా అప్ డేట్ చేయలేదు. ఈ లోపుగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ భవనం నిర్వహణ సరిగా లేదని కూడా అధికారులు గుర్తించారు. దీంతో ఫైర్ ఫైటింగ్ సిస్టం అప్ డేట్ చేయలేదనే అభిప్రాయాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన భవనంలో 12 మదిని అధికారులు రక్షించారు.
also read:హైద్రాబాద్‌లో ఏడాదిలో నాలుగు అగ్నిప్రమాదాలు: 29 మంది మృతి
స్వప్నలోక్ కాంప్లెక్స్ లోని రెండు మూడు అంతస్థలు అగ్ని ప్రమాదం కారణంగా స్వల్పంగా దెబ్బతిన్నాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. హైద్రాబాద్, సికింద్రాబాద్ లలో వరుసగా జరిగిన అగ్ని ప్రమాదాల్లో 29 మంది మృతి చెందారు. గత ఏడాది మార్చి నుండి ఇప్పటి వరకు జరిగిన నాలుగు భారీ అగ్ని ప్రమాదాలు జరిగాయి.