తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా వుండాలని వైఎస్ షర్మిల సారథ్యంలోని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది . దీనిపై వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా వుండాలని వైఎస్ షర్మిల సారథ్యంలోని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్ధతివ్వాలని వైఎస్‌ఆర్‌టీపీ నిర్ణయం తీసుకుంది. దీనిపై వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. షర్మిల ఓ పార్టీకి అధ్యక్షురాలని.. ఆమె నిర్ణయాలు ఆవిడ ఇష్టమని ఆయన క్లారిటీ ఇచ్చారు. వైసీపీకి ఈ రాష్ట్రానికి చెందిన విషయాలే ముఖ్యమని సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ కుటుంబాన్ని వేధించింది.. ఇబ్బందులు పెట్టిందన్న సంగతి అందరికీ తెలుసునని ఆయన గుర్తుచేశారు. సీఎం జగన్‌పై అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన పార్టీ కాంగ్రెస్ అని సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతకుముందు శుక్రవారంనాడు వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల లోటస్ పాండ్ లో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఈ ఎన్నికల్లో పోటీ చేయవద్దని నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను వైఎస్ షర్మిల మీడియాకు వివరించారు. బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో పోటీ చేయవద్దని నిర్ణయం తీసుకున్నామని వైఎస్ షర్మిల ప్రకటించారు.
undefined
Also Read: కాంగ్రెస్‌కు వైఎస్ఆర్‌టీపీ మద్దతు, పోటీకి దూరం: వైఎస్ షర్మిల కీలక ప్రకటన
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు భేషరతుగా మద్దతు ఇస్తున్నట్టుగా వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ కు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్ అవకాశాలకు అడ్డుపడకూడదనే ఉద్దేశ్యంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా వైఎస్ షర్మిల తెలిపారు. ప్రభుత్వం మారే అవకాశం వచ్చినప్పుడు అడ్డుపడడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. కేసీఆర్ అవినీతి పాలనను అడ్డుకొనేందుకు కాంగ్రెస్ కు మద్దతివ్వాలని నిర్ణయం తీసుకున్నట్టుగా షర్మిల వివరించారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధులను బరిలోకి దింపి కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బతీయడం ఇష్టం లేదన్నారు.