భాగ్యలక్ష్మి ఆలయానికి కాంగ్రెస్ నేతలు : సోనియా గాంధీ కోలుకోవాలని ప్రత్యేక పూజలు

By narsimha lode  |  First Published Jun 3, 2022, 9:20 AM IST


హైద్రాబాద్ నగరంలోని పాతబస్తీ భాగ్యలక్ష్మి ఆలయంలో శుక్రవారం నాడు కాంగ్రెస్ నేతలు పూజలు నిర్వహించారు. కరోనాతో బాధపడుతున్న సోనియాగాంధీ త్వరగా కోలుకోవాలని కోరుతూ పూజులు చేశారు. 


హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలోని Bhagyalaxmi ఆలయంలో శుక్రవారం నాడు Congress నేతలు పూజలు నిర్వహించారు. కాగ్రెస్ పార్టీ అధినేత్రి Sonia Gandhi  త్వరగా కోలుకోవాలని కోరుతూ కాంగ్రెస్ నేతలు భాగ్యలక్ష్మి ఆలయంలో ఇవాళ పూజలు చేశారు.సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, సీనియర్ నేత వి. హనుమంతరావు, ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, తదితరులు ఇవాళ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు.హిందూవులు అసహ్యించుకొనేలా బీజేపీ నేతలు ప్రవర్తిస్తున్నారన్నారు.భాగ్యలక్ష్మి అమ్మవారు అందరి దేవత అని ఆయన అన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి బీజేపీ నేతలు లబ్దిపొందాలని చూస్తున్నారని భట్టి విక్రమార్క మండిపడ్డారు.ఈ విషయమై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.బండి సంజయ్ పుట్టిన తర్వాతే భాగ్యలక్ష్మి అమ్మవారికి పూజలు చేయడం లేదన్నారు సీఎల్పీ నేత. అమ్మవారి ఆలయం బండి సంజయ్‌కి రాసివ్వలేదన్నారు. 

Latest Videos

undefined

also read:చార్మినార్‌పై అలా అనలేదు, భాగ్యలక్ష్మి టెంపుల్ పై చేయి వేస్తే ఊరుకోం: బండి సంజయ్ ఫైర్

భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని తీసివేస్తామని ఎవరు అన్నారని  మరో కాంగ్రెస్ నేత వీహెచ్ ప్రశ్నించారు.సోనియా గాంధీ కోలుకోవాలని భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు చేసినట్టుగా వీహెచ్ చెప్పారు. మేం పుట్టి పెరిగింది ఒక్కడే మాకు కథలు చెప్పొద్దని వీహెచ్ బండి సంజయ్ కి హితవు పలికారు.

పాతబస్తీలో Charminar లో నమాజ్ చేసేందుకు అనుమతివ్వాలని కాంగ్రెేస్ నేతు Rasheed khanన్ సంతకాల సేకరణ చేయడాన్ని BJP  తప్పు బట్టింది.జ తాము భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు చేయడంతోనే చార్మినార్ లో Namaz చేసేందుకు అనుమతి కోసం  రషీద్ ఖాన్  సంతకాల సేకరణ చేయడం ప్రస్తుతం రాజకీయ పార్టీల మధ్య పరస్పర విమర్శలకు దారి తీసింది. 

Congress, BJP నేతలు ఈ నెల 2వ తేదీన ఈ విషయమై పరస్పరం విమర్శలు చేసుకొన్నారు. భాగ్యలక్ష్మి ఆలయంపై చేయి వేస్తూ ఊరుకోబోమని బీజేపీ నేతలు తేల్చి చెప్పారు.  చార్మినార్ ను తొలగిస్తామని తాము చెప్పలేదని బీజేపీ తెలంగాణ చీఫ్ Bandi Sanjay తేల్చి చెప్పారు.

చార్మినార్ లో నమాజ్ కి అనుమతివ్వాలని కాంగ్రెస్ నేత రషీద్ ఖాన్ సంతకాల సేకరణ చేయడాన్ని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ తప్పు బట్టారు.  భాగ్యలక్ష్మి ఆలయంలో తాము పూజలు చేస్తే చార్మినార్ లో నమాజ్ చేయాలనే ఆలోచన వచ్చిందా అని ఆయన ప్రశ్నించారు.భాగ్యలక్ష్మి ఆలయం, చార్మినార్ లను చూపి రెండు పార్టీలు విమర్శలకు దిగాయి.ఈ అంశంపై రాజకీయంగా ప్రయోజనం పొందేందుకు రెండు పార్టీలు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

రషీద్ ఖాన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉందో లేదో తనకు తెలియదని ఈ నెల 2న  కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ఓ తెలుగు న్యూస్ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొనడం గమనార్హం. ఇదిలా ఉంటే చార్మినార్ లో నమాజ్ కు అనుమతి కోసం తాను సీఎం కేసీఆర్ ను కలుస్తానని కూడా రషీద్ ఖాన్ ప్రకటించడం కూడా కలకలం రేపుతుంది. 

click me!