మాజీ ప్రియుడిగా నమ్మించి అర్ధనగ్న ఫోటోలు... హైదరాబాద్ యువతిని బ్లాక్ మెయిల్ చేస్తున్న యువకుడు

Arun Kumar P   | Asianet News
Published : Jun 03, 2022, 07:49 AM ISTUpdated : Jun 03, 2022, 08:09 AM IST
మాజీ ప్రియుడిగా నమ్మించి అర్ధనగ్న ఫోటోలు... హైదరాబాద్ యువతిని బ్లాక్ మెయిల్ చేస్తున్న యువకుడు

సారాంశం

యువతిని మాజీ ప్రియుడిగా నమ్మించి అర్ధనగ్న ఫోటోలు, వీడియోలు సేకరించి బ్లాక్ మెయిల్ దిగిన యువకుడిని హైదరాబాద్ షీ టీమ్స్ పట్టుకుని కటకటాల వెనక్కి తోసారు.

హైదరాబాద్: మాజీ ప్రియుడని భావించి తన అర్ధనగ్న ఫోటోలు, వీడియోలు మరో యువకుడికి పంపింది ఓ యువతి. ఇంకేముందు ఆ ఫోటోలను అడ్డుపెట్టుకుని అతడు యువతిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. అయితే యువతి మాత్రం అతడి బెదిరింపులకు భయడిపోకుండా షీ టీమ్స్ ను ఆశ్రయించింది. ఈ ఘటన  తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ (hyderabad) శివారులోని శివరాంపల్లిలో నివాసముంటే మహ్మద్ మొహసీన్ (22) పెయింటింగ్ పనులు చేస్తుంటాడు. ఇతడి స్నేహితుడొకడు గతంలో ఓ యువతి ప్రేమించి ప్రస్తుతం దూరంగా వుంటున్నాడు. ఈ విషయం తెలిసి మొహసీన్ నీచానికి పాల్పడ్డాడు. 

స్నేహితుడి మాజీ ప్రియురాలి ఫోన్ నెంబర్ మొహసీన్ ఎలాగోలా సేకరించాడు. ఆమెకు ఫోన్ చేసి మాజీ ప్రియుడు రాజు మాట్లాడుతున్నట్లు నమ్మించాడు. తన ప్రియుడే మనసుమార్చుకుని మళ్లీ తనతో మాట్లాడుతున్నట్లు యువతి కూడా నమ్మింది. దీంతో ఇద్దరి మధ్య మాటలు కాస్తా ఆన్ లైన్ చాటింగ్ వరకు చేరుకున్నాయి. 

 యువతి పూర్తిగా నమ్మిన తర్వాత ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు పంపాలని అతడు కోరాడు. దీంతో యువతి అర్థనగ్నంగా వున్న ఫోటోలు, వీడియోలను అతడికి పంపింది. ఇంకేముంది అనుకున్న పని పూర్తవడంతో  మొహసీన్ తన అసలు రూపాన్ని బయటపెట్టాడు.

తానెవరో బయటపెట్టిన మొహసీన్ ఫోటోలను అడ్డం పెట్టకుని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఈ  ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించి  యువతిని డబ్బులు డిమాండ్ చేసాడు. ఆమె కాళ్ళావేళ్లా పడి వేడుకున్నా ఫోటోలు డిలీట్ చేయడానికి అంగీకరించలేదు. 

అయితే యువతి అతడి బెదిరింపులకు భయపడకుండా షీ టీమ్స్ ని ఆశ్రయించింది. బాధిత యువతి ఫిర్యాదు మేరకు మొహసీన్ ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. దీంతో   అతడిని మలక్ పేట పోలీస్ స్టేషన్లో అప్పగించారు.  అతడిపై సెక్షన్ 385,354 ఐపిసి, 67ఏ ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసారు పోలీసులు. 

ఇలాంటి దారుణమే ఈ ఏడాది ఆరంభంలో జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. విద్యాబుద్దులు నేర్పాల్సినవాడే బుద్దితప్పి తన స్టూడెంట్ పై కన్నేసి అత్యంత నీచంగా వ్యవహరించాడు. విద్యార్థిణితో పాటు ఆమె తల్లికి పోర్న్ వీడియోలు, అమ్మాయిల నగ్న ఫోటోలు పంపిస్తూ రాక్షసానందం పొందాడు. 

జగిత్యాలకు చెందిన రేగొండ వెంకట సాయి(31) ఓ ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. ఈ క్రమంలో అదే పాఠశాలకు చెందిన విద్యార్థిణుల ఫోన్ నెంబర్లు సేకరించిన అతడు వారితో అసభ్యకరంగా చాట్ చేసేవాడు. ఈ విషయం విద్యార్థిణుల తల్లిదండ్రులకు తెలిసి స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసారు. దీంతో అతడిని ఉద్యోగం నుండి తొలగించారు. అయినా అతడి బుద్ది మాత్రం మారలేదు. ఓ మైనర్ బాలికపై కన్నేసిన వెంకటసాయి ఎలాగోలా ఆమె ఫోన్ నెంబర్ సేకరించాడు. బాలికతో చాటింగ్ చేస్తూ పరిచయం పెంచుకున్నాడు. ఇలా కొంతకాలం ఛాటింగ్ సాగిన తర్వాత తనను ప్రేమిస్తున్నానని బాలికకు వెంకటసాయి చెప్పాడు. దీంతో బాలిక అతడి మెసేజ్ లకు రిప్లై ఇవ్వడం మానేసింది.  దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న అతడు దారుణంగా వ్యవహరించాడు. 

బాలికతో పాటు ఆమె తల్లికి నగ్న ఫోటోలు, వీడియోలు పంపించి వేధింపులకు దిగాడు. దీంతో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడు వెంకటసాయిని అరెస్ట్ చేసారు. అతడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు. 
 


 

PREV
click me!

Recommended Stories

Harish Rao Aarogyasri Speech:ఆరోగ్యశ్రీ బిల్లులపై పై హరీష్ రావు కీలక కామెంట్స్ | Asianet News Telugu
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం: Revanth Reddy Powerful Speech in Assembly: | Asianet Telugu