క్రికెట్ బెట్టింగ్ కోసం అప్పులు చేసి.. తీర్చలేక చెరువులో దూకి..

By SumaBala Bukka  |  First Published Jun 3, 2022, 7:57 AM IST

క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు కోల్పోయి.. అప్పులపాలై తీర్చలేక ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని తుప్రాన్ పరిధిలో చోటు చేసుకుంది. 


హైదరాబాద్ : T20 League bettingలో నష్టపోయి అప్పుల పాలు కావడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు suicideకు పాల్పడిన ఘటన గురువారం హైదరాబాదులో వెలుగులోకి వచ్చింది. తూప్రాన్ ఎస్ఐ సురేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. శివ్వంపేటకు చెందిన ఆచారి ముత్యాలు దంపతుల చిన్న కొడుకు కమ్మరి అనిల్ కుమార్ చారి ఆభరణాలు తయారు చేసే పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా liquorకు బానిసైన అనిల్ కుమార్ t20 లీగ్ బెట్టింగ్ లకు అలవాటు పడ్డాడు. ఇంట్లో తల్లి ముత్యాలు పలుమార్లు మందలించిన అతడిలో మార్పు రాలేదు. ఇటీవల జరిగిన టి20 చివరి మ్యాచ్లో అప్పులు చేసి మరీ బెట్టింగులు వేశాడు. 

వాటిని తీర్చేందుకు సతమతమయ్యాడు. అప్పు చెల్లించేందుకు నగదు ఇవ్వాలని తల్లితో గొడవ పడ్డాడు.  ఆమె ఇవ్వలేనని చెప్పడంతో గత నెల 31న ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. దీంతో కుటుంబీకులు అన్ని చోట్ల వెతికినా ఫలితం లేకపోయింది. చివరకు గురువారం తూప్రాన్ పెద్ద చెరువులో బతుకమ్మ ఘాట్ వద్ద అనిల్ కుమార్ మృతదేహం లభించడంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడి సోదరుడు అశోక్ చారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వివరించారు. బాధిత కుటుంబాన్ని శివ్వంపేట జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్త పరామర్శించి, ఆర్థిక సాయం అందజేశారు.

Latest Videos

undefined

ఇదిలా ఉండగా, బడంగ్పేట్ కార్పొరేషన్ పరిధిలోని మామిడి పల్లికి చెందిన ఈరంకి శరత్ వంశీగౌడ్ అనే Engineering student బుధవారం అర్థరాత్రి Suicide చేసుకున్నాడు. TRS Corporatorఅతని సోదరుడు దాడి చేయడంతో.. ఆ అవమానం భరించలేక తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థి తండ్రి నరసింహ గౌడ్ ఆరోపించారు. ఈ మేరకు బుధవారం ఆయన మాట్లాడుతూ...  ‘నేను మామిడిపల్లిలో నీటి ట్యాంకర్ల వ్యాపారం చేస్తుంటా. నెల రోజుల కిందట ఓ రాత్రి బోర్ వద్ద విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో.. అక్కడికి వెళ్లి ఫోన్ లో లైట్ తో దాన్ని పరిశీలించా. ఆ పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి, చదును చేస్తున్న స్థానిక టిఆర్ఎస్ కార్పోరేటర్ శివకుమార్ అతని సోదరుడు శ్రీకాంత్ నా వద్దకు వచ్చి ‘వీడియో తీస్తున్నావా’ అంటూ దాడికి ప్రయత్నం చేశారు.

విషయం నా కుమారుడు శరత్ వంశీ గౌడ్ కు తెలియడంతో కార్పొరేటర్ ను ప్రశ్నించగా వివాదం చోటుచేసుకుంది. దాంతో కార్పోరేటర్.. అతని సోదరుల నుంచి ప్రాణభయం ఉందని అదే రోజు పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. మే 27న మా కుమారుడిపై కార్పొరేటర్ సోదరుడు మళ్లీ దాడి చేశాడు. ఈ అవమానభారంతో బుధవారం రాత్రి తన గదిలో ఉరివేసుకున్నాడు. ఈ విషయాన్ని గురువారం ఉదయం గుర్తించాం… అని వాపోయారు. అయితే దాడుల ఘటనలపై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. యువకుడు మృతిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం అన్నారు.

click me!