సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఇవాళ ఢిల్లీకి వెళ్లారు. రెండు రోజుల్లో పాదయాత్ర ప్రారంభించాల్సిన భట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.
హైదరాబాద్: సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మంగళవారంనాడు ఢిల్లీకి బయలుదేరారు . ఎల్లుండి నుండి భట్టి విక్రమార్క పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఈ తరుణంలో భట్టి విక్రమార్క ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు.
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఈ నెల 16వ తేదీ నుండి పాదయాత్రను ప్రారంభించాల్సి ఉంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లా నుండి ఖమ్మం జిల్లా వరకు ఈ యాత్ర సాగుతుంది. పాదయాత్రతో పాటు ఇతర అంశాలపై భట్టి విక్రమార్క చర్చిస్తారని సమాచారం.
undefined
ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రాష్ట్రంలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు.మరో వైపు మహేశ్వర్ రెడ్డి ప్రారంభించిన పాదయాత్రకు బ్రేక్ పడింది. పాదయాత్రను నిలిపివేయాలని మహేశ్వర్ రెడ్డిని మాణిక్ రావు ఠాక్రే ఆదేశించారు.ఈ విషయమై మాణిక్ రావు ఠాక్రేకు మహేశ్వర్ రెడ్డి లేఖ రాశారు.
రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా రాష్ట్ర నేతలు తమ ప్రాంతాల్లో పాదయాత్రలు నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నిర్ణయం మేరకు హత్ సే హత్ జోడో అభియాన్ పేరుతో పాదయాత్రలను స్థానిక నేతలు నిర్వహిస్తున్నారు. ఈ యాత్రలతో ప్రజల్లో పార్టీ నేతలు ఉండేలా కాంగ్రెస్ నాయకత్వం ప్లాన్ చేసింది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రెండో విడత పాదయాత్రను కూడా ప్రారంభించనున్నారు.
also read:పార్టీ ఇంచార్జ్‌గా ఉన్న మీరే ఇలా చేస్తే ఎలా..?: మాణిక్‌రావ్ ఠాక్రేకు మహేశ్వర్ రెడ్డి లేఖ..
ఇదిలా ఉంటే ధరణి అదాలత్ విషయమై తనకు సమాచారం లేకపోవడంపై మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా సమాచారం.ఈ విషయమై పార్టీ పెద్దలతో దామోదర రాజనర్సింహ చర్చించనున్నారు.