క్లబ్బులు, పబ్‌లు మూసివేయాలి: సీఎల్పీ నేత భట్టి

Published : Mar 26, 2021, 01:30 PM IST
క్లబ్బులు, పబ్‌లు మూసివేయాలి: సీఎల్పీ నేత భట్టి

సారాంశం

:కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను పబ్‌లు, క్లబ్ లను కూడా మూసివేయాలని  సీఎల్పీనేత మల్లుభట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.

హైదరాబాద్:కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను పబ్‌లు, క్లబ్ లను కూడా మూసివేయాలని  సీఎల్పీనేత మల్లుభట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.శుక్రవారం నాడు తెలంగాణ అసెంబ్లీలో సీఎల్పీ నేత మల్లు  భట్టి విక్రమార్క ప్రసంగించారు.

స్కూళ్లు తెరిచిన నెల రోజులకే కరోనా కారణంగా మూసివేశామన్నారు. బెల్ట్ షాపులను కూడ మూసివేయాలని ఆయన కోరారు.  కరోనాను నియంత్రించేందుకు గాను వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆయన కోరారు. 

also read:14వ ఫైనాన్స్ కమిషన్ కు లోబడే అప్పులు: తెలంగాణ అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్

57 ఏళ్లవారికి పెన్షన్ ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. నిరుద్యోగ భృతిపై సీరియస్ గా ఆలోచించాలన్నారు.రోడ్ల మరమ్మత్తులకు నిధులను కేటాయించాలని ఆయన కోరారు.తెలంగాణలో  కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఆన్ లైన్ లో క్లాసులు నిర్వహిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Fog Alert : అధికపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో ఫాగ్ సైక్లోన్ కొనసాగుతోందా..? ఈ 12 జిల్లాలకు హైఅలర్ట్
Jabardasth Anchor Rashmi Gowtham Pressmeet: మీ సంస్కృతి అంతా మా బట్టలపైనే ఉంది| Asianet News Telugu