14వ ఫైనాన్స్ కమిషన్ కు లోబడే అప్పులు: తెలంగాణ అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్

By narsimha lodeFirst Published Mar 26, 2021, 1:09 PM IST
Highlights

వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం విద్యతో పాటు రవాణా, క్రీడలు  కళలకు ఖర్చులను తగ్గిస్తోందని కాగ్ అభిప్రాయపడింది.

హైదరాబాద్: వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం విద్యతో పాటు రవాణా, క్రీడలు  కళలకు ఖర్చులను తగ్గిస్తోందని కాగ్ అభిప్రాయపడింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నాడు అసెంబ్లీలో కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది. తెలంగాణాలో ద్రవ్యలోటు, చెల్లించాల్సిన రుణ బాధ్యతలు 14వ ఆర్ధిక సంఘం నిర్దేశించిన శాతాలకు లోబడే ఉన్నాయని కాగ్ తేల్చి చెప్పింది. అయితే ప్రాథమిక లోటులో తగ్గుదల ఉన్నప్పటికీ ప్రాథమిక వ్యయాన్ని భరించే స్థాయిలో అప్పులు మినహా ఇతర రాబడి లేదని కాగ్ వ్యాఖ్యానించింది.

బడ్జెట్ అంచనాలకు వాస్తవాలకు మధ్య తేడా తగ్గేలా బడ్జెట్ తయారీ ప్రక్రియను హేతుబద్దీకరించాలని సూచించింది కాగ్.సాగునీటి ప్రాజెక్టులపై భారీగా ఖర్చు చేస్తున్న ప్రభుత్వం వాటి ఆర్ధిక ఫలితాలను మాత్రం ఇంతవరకు వెల్లడించలేదని తెలిపింది.

రెవిన్యూ రాబడి, ఖర్చుల పెరుగుదల 2015-16 నుండి 2018-19 మధ్యకాలంలో జీఎస్డీపీలో రెవిన్యూ రాబడి, ఖర్చులు మాత్రం స్వల్పంగా తగ్గాయని కాగ్ తెలిపింది14వ ఆర్ధిక సంఘం నిర్ధేశించిన 3.25 శాతం కన్నా ద్రవ్యలోటు జీఎస్డీపీలో తక్కువగానే 3.10 శాతం ఉందని కాగ్ ప్రకటించింది.

2019 మార్చి నాటి ప్రకారంగా ప్రభుత్వ అప్పుల్లో 46 శాతం రూ. 76,262 కోట్లను రానున్న ఏడేళ్లలో తీర్చాల్సి ఉంది. శాసనసభ ఆమోదం లేకుండా 2014-15 నుండి 2017-18 మధ్య కాలంలో రూ.55,517 కోట్లు అధికంగా ఖర్చు చేసిన విషయాన్ని కాగ్ గుర్తు చేసింది. 
 

click me!