యూట్యూబ్ లో చూస్తూ అబార్షన్లు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకున్నాడో ఫేక్ డాక్టర్. వైద్యశాఖ అధికారులు అతని గుట్టును రట్టు చేయడంతో పోలీసులు ఆ వైద్యుడ్ని అరెస్ట్ చేశారు. ఆస్పత్రిని సీజ్ చేశారు. మహిళల ప్రాణాలతో చెలగాటమాడిన ఫేక్ డాక్టర్ ఇంద్రారెడ్డిమీద క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు.

వరంగల్ రూరల్ జిల్లా చెంగారావు పేటకు చెందిన ఇంద్రారెడ్డి గత నెల హన్మకొండలో ఏకశిలా పార్కు ఎదురుగా సిటీ హాస్పటిల్ పేరుతో ఆస్పత్రిని ప్రారంభించాడు. పిల్లలు వద్దనుకునే మహిళలు, ఇతర సమస్యలున్న వారికి అబార్షన్లు చేస్తున్నాడు.
గ్రామంలో ఆర్ఎంపీలు, పీఎంపీల ద్వారా బాధితులను గుర్తించి వారికి కమిషన్లు ఇచ్చి పేషంట్లను తీసుకువచ్చేవాడు. ఇక నర్సింగ్ లో శిక్షణ పొందిన వారి సహాయంతో యూ ట్యూబ్ లో చూస్తూ అబార్షన్లు చేస్తున్నాడు.
ఇదిలా ఉండగా, ఇంద్రారెడ్డి ట్రీట్మెంట్ మీద వైద్యశాఖ అధికారులకు ఎవరో అనుమానంతో సమాచారం ఇచ్చారు. ఆ టైంలో మహారాష్ట్ర నుంచి వచ్చిన మహిళలకు ఇంద్రారెడ్డి అబార్షన్ చేస్తున్నాడు.
అధికారులను చూసిన ఆస్పత్రి సిబ్బంది ఒక్కసారిగా గోడదూకి పారిపోయారు. ఆపరేషన్ థియేటర్లో ఉన్న మహిళను బాత్రూంలో దాచారు. ఇది గమనించిన అధికారులు మహిళకు తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో హన్మకొండ జీఎంహెచ్‌కు తరలించారు.
ఇంద్రారెడ్డి మూడేళ్ల క్రితం వరంగల్ రూరల్ జిల్లా నర్సాపేట్ లోనూ ఓ ఆస్పత్రి ఏర్పాటు చేయగా అక్కడ ఇలాగే బుక్ అయ్యాడు. అప్పుడే ఇంద్రారెడ్డిని అరెస్ట్ చేసి అధికారులు ఆస్పత్రిని సీజ్ చేశారు. అయినా మళ్లీ ఇప్పుడు హన్మకొండలో మరో ఆస్పత్రి పెట్టి మరోసారి ఈ ఫేక్ డాక్టర్ దొరికిపోయాడు.