నానక్ రామ్ గూడాలోని వీకే టవర్స్ లో International Arbitration and Mediation Centre (ఐఏఎంసీ) ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావులు ప్రారంభించారు.
హైదరాబాద్ : నానక్ రామ్ గూడాలోని వీకే టవర్స్ లో International Arbitration and Mediation Centre (ఐఏఎంసీ) ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావులు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ట్రస్టీలు - సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వర రావు, జస్టిస్ హిమాకోహ్లి, సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ ఆర్వీ రవీంద్రన్, హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
undefined
ఇదిలా ఉండగా, డిసెంబర్ 4న ఇదే విషయంలో మాట్లాడుతూ Mahabharatamలోనూ మధ్యవర్తిత్వం ఉందని.. కౌరవులకు, పాండవులకు శ్రీకృష్ణ పరమాత్మ మధ్యవర్తిత్వం చేశారని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి Chief Justice of India NV Ramana అన్నారు. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటుకు హైదరాబాద్ సరైన వేదిక అని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో శనివారం జరిగిన International Arbitration and Mediation Centre సన్నాహక సదస్సులో సీజేఐ ఎన్వీ రమణ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగడం వల్ల కాలయాపన జరుగుతుందని.. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రంతో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. డిసెంబర్ 18న ఆర్బిట్రేషన్ సెంటర్ నూతన కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్టుగా చెప్పారు. ఆర్బిట్రేషన్ సెంటర్‌ను నెలకొల్పడంలో జస్టిస్ హిమా కోహ్లీ సహకారం మర్చిపోలేనని సీజేఐ పేర్కొన్నారు.
CJI NV Ramana: మహాభారతంలోనూ మధ్యవర్తిత్వం.. కోర్టుకు రావడం అనేది ఆఖరి ప్రయత్నం కావాలి: సీజేఐ రమణ
Courtsను ఆశ్రయించే ముందు మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలని సూచించారు. మధ్యవర్తిత్వం ద్వారా తక్కువ సమయంలో పరిష్కారాలు కనుగొనవచ్చని అన్నారు. ఆస్తుల పంపకాలను కుటుంబ సభ్యులు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించారు. తద్వారా ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ కాలాన్ని వృధా చేసుకోవద్దని కోరారు. కోర్టుకు రావడమనేది ఆఖరి ప్రత్యామ్నాయంగా మాత్రమే ఉండాలన్నారు.
మహాభారతంలోనూ మధ్యవర్తిత్వం ప్రస్తావన ఉందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ‘మధ్యవర్తిత్వం మహాభారతంలో కూడా ప్రస్తావించబడింది. మేము మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలను ముగించగలము. వీలైనంత వరకు,వివాదాలను పరిష్కరించడానికి మహిళలు మధ్యవర్తిత్వం వహించాలి. కౌరవులకు, పాండవులకు శ్రీకృష్ణ పరమాత్ముడు మధ్యవర్తిత్వం చేశారు. బిజినెస్‌లో సమస్యలు వస్తే కోర్టులకు వస్తారు. 40 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నా ఆర్బిట్రేషన్ చివరి దశలో జరగాలి. అంతర్జాతీయ పరిస్,సింగపూర్, లండన్, హంకాంగ్‌లో ఆర్బిట్రేషన్ సెంటర్లు ఉన్నాయి.
హైదరాబాద్‌లో ఈ సెంటర్‌ను పెట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇక్కడ ఫార్మా, ఐటీ, ఇతర పరిశ్రమలు ఉన్నాయి. హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం అని.. ఈ సెంటర్ ఏర్పాటు ఆలోచన గురించి కేసీఆర్ తో ప్రస్తావించినప్పుడు సానుకూలంగా స్పందించారు. సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వ సహకారం లేకుండా సెంటర్ ఏర్పాటు సాధ్యం అయ్యేది కాదు. హైదరాబాద్‌లో ఈ సెంటర్‌ను పెట్టడం చాలా సంతోషం. ఆర్బిట్రేషన్ సెంటర్‌ను నెలకొల్పడంలో జస్టిస్ హిమా కోహ్లీ సహకారం మర్చిపోలేను’ అని సీజేఐ రమణ అన్నారు.