ఆర్బిట్రేషన్‌ సెంటర్‌‌ వల్ల హైదరాబాద్‌కు మరింత పేరు: సీజేఐ ఎన్వీ రమణ

Published : Mar 12, 2022, 02:46 PM ISTUpdated : Mar 12, 2022, 02:53 PM IST
ఆర్బిట్రేషన్‌ సెంటర్‌‌ వల్ల హైదరాబాద్‌కు మరింత పేరు: సీజేఐ ఎన్వీ రమణ

సారాంశం

హైదరాబాద్‌ హైటెక్స్‌లోని ఐకియా వెనుక ప్రాంతంలో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ (International Arbitration and Mediation Centre) శాశ్వత భవన నిర్మాణానికి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ  (CJI NV Ramana)శంకుస్థాపన చేశారు. 

హైదరాబాద్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ (International Arbitration and Mediation Centre) ప్రపంచ ఖ్యాతి సాధించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ (CJI NV Ramana) ఆకాంక్షించారు. అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం వల్ల హైదరాబాద్‌కు మరింత పేరు వస్తుందన్నారు. హైటెక్స్‌లోని ఐకియా వెనుక ప్రాంతంలో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ శాశ్వత భవన నిర్మాణానికి జస్టిస్ ఎన్వీ రమణ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్‌ ఎల్.నాగేశ్వర్‌రావు (Justice L Nageswara Rao), జస్టిస్‌ హిమాకోహ్లీ, హైకోర్టు సీజే జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి, మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. దుబాయ్, లండన్, సింగపూర్ మాదిరి హైదరాబాద్ కేంద్రం ప్రపంచ ఖ్యాతి సంపాదించాలని ఆకాంక్షించారు.ఐఏఎంసీ ప్రతిపాదనను సీఎం కేసీఆర్‌కు చెప్పగానే వెంటనే ఒప్పుకున్నారని తెలిపారు. అంతే త్వరగా దానికోసం ఓ తాత్కాలిక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారన్నారు. నేడు ఈ భవన నిర్మాణానికి భూమిపూజ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. దీనికోసం రూ.50 కోట్లు కేటాయించారని సీజేఐ వెల్లడించారు. భవన నిర్మాణానికి గచ్చిబౌలిలోని ఎంతో విలువైన భూమి కేటాయించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌కు జస్టిస్ ఎన్వీ రమణ ధన్యవాదాలు తెలిపారు. 

 

ఏడాదిలోగా భవన నిర్మాణం పూర్తి కావాలని ఆశిస్తున్నామని సీజేఐ ఎన్వీరమణ పేర్కొన్నారు. ఇక, IAMC ప్రస్తుతం హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలోని తాత్కాలిక క్యాంపస్‌లో పనిచేస్తోంది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?