రేపు హైదరాబాద్‌కు జస్టిస్ ఎన్వీ రమణ.. సీజేఐ హోదాలో తొలిసారిగా తెలంగాణకు

By Siva KodatiFirst Published Jun 10, 2021, 8:36 PM IST
Highlights

రేపు హైదరాబాద్‌కు రానున్నారు సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ. సీజేఐగా నియమితులయ్యాకా తొలిసారిగా ఆయన హైదరాబాద్‌కు వస్తున్నారు. రేపు మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయంలో జస్టిస్ ఎన్వీ రమణకు మంత్రి కేటీఆర్ ఇతర మంత్రులు స్వాగతం పలకనున్నారు. రాజ్‌భవన్‌లో బస చేయనున్నారు జస్టిస్ ఎన్వీ రమణ.

కాగా, నిన్న తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు జస్టిస్ ఎన్‌వీ రమణ. తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42కి పెంచారు. రెండేళ్లుగా మూలనపడిన హైకోర్టు ఫైలును సీజేఐ వెలికితీశారు. హైకోర్టు విజ్ఞప్తిని ప్రధాన న్యాయమూర్తి మన్నిస్తూ.. ఆ దస్త్రానికి ఆమోద ముద్ర వేశారు.

Also Read:సీజేఐ ఎన్వీ రమణ నుంచి ప్రత్యుత్తరం.. ఆనందంలో చిన్నారి..!

మరోవైపు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిల్ ఎన్వీ రమణ ఏప్రిల్ 24న ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్ నాథ్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రపతి భవన్ లో నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమానికి  ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సుప్రీం కోర్టు సీజేఐగా జస్టిల్ బోబ్డే పదవీకాలం ముగియడంతో జస్టిస్ రమణ 48వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. 2021 ఏప్రిల్ 24 నుంచి 2022 ఆగస్టు 26 వరకు రమణ పదవీలో కొనసాగనున్నారు. 

click me!